ప్రజాశక్తి-అమలాపురం
సొంత వాహనం కలిగి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరువేస్తున్న డ్రైవర్లకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర కార్యక్రమాన్ని వరుసగా 5వ ఏడాది అమలు చేసిందని జిల్లా కలక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. శుక్రవా రం విజయవాడ విద్యాధరపురంలో జరిగిన కార్యక్ర మంలో సిఎం జగన్ నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వర్చు వల్ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ సొంత వాహనం కలిగిన వారికి, బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, పథకం రవాణా, రోడ్లు భవనాలశాఖ ద్వారా వాహన డ్రైవర్ల అభ్యున్నతికై చేపట్టిన సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమమన్నారు దరఖాస్తుదారు ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ క్యాబిని సొంతంగా నడపాలని దరఖాస్తు దారుడు ఆటో రిక్షా తేలికపాటి మోటారు వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎండీయూ ఆపరేటర్లకు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు తదితర అవసరాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఒక్కొక్కరికి ఏటా రూ.10వేల సాయం అంది స్తోందన్నారు. అర్హత కలిగి ఏదైనా సాంకేతిక కారణాలతో ఈ పథకం లబ్ధి చేకూరని వాహన యజమానులు ఎవరైనా మిగిలి ఉంటే వారు దగ్గరలోని సచివాలయంలో సంప్రదించి మరల తిరిగి దరఖాస్తు చేసు కోవాలని సూచించారు. వరుసగా ఐదో విడత తమకు రూ.పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించిన సిఎంకు లబ్ధిదార డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా బలహీనమైన టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిం చడం ద్వారా ఆదాయాన్ని పెంచి టాక్సీ మరమ్మతుల ఖర్చులను తగ్గించడం ఈ పథకం ఉద్దేశమన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తూ ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పథకం చొప్పున ప్రజలకు చాలా రకాల పథకాలను అందు బాటులోకి తెచ్చిందన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అంది స్తున్న పథకాల్లో వాహన మిత్ర పధకం కూడా ఒకటని, వాహనం యొక్క మెయింటెనెన్స్ ఖర్చులు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి ఇతర డాక్యు మెంట్లు పొందటానికి ప్రభుత్వం డ్రైవర్లకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించిందన్నారు. ఈ పథకం రవాణా రంగంలో స్వ యం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశింపబ డిందన్నారు. కోనసీమ జిల్లాలో 7,520 మందికి వాహన మిత్రులకు రూ.7 కోట్ల 52 లక్షలు మేరా నిధులు జమ అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి అశోక్ ప్రతాప్‌రావు, హితకారిణి సమాజం ఛైర్మన్ కాశీ బాల మునికుమారి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా ప్రభుత్వ భవన నిర్మాణాలు పూర్తి చేయాలి
అమలాపురం ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయా లని లేని పక్షంలో పంచాయితీరాజ్ ఇంజినీర్లపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో రాజోలు, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల పురోగతిపై పంచాయతీ రాజ్ ఇంజినీర్లు, ఎంపిడిఒలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సచివాలయ భవనాలు, ఆర్‌బికెలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాల పురోగతి పై సమీక్షించి అసంతప్తిని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ వైయస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి చేయా లని ఫ్యామిలీ డాక్టర్ విధానం తదితర వైద్య సేవలు కార్య కలా పాల నిర్వహణకు ఈ భవనాలు కీలకంగా మారాయన్నారు. నిర్మాణాలు పూర్త యిన భవనాలను సంబంధిత శాఖల అధికారులకు అప్పగించి వాటిలో కార్యకలాపాలు నిర్వహిం చు కునేలా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం భవన నిర్మాణాలు అవసరమైన నిధులను మంజూరు చేయడంతో పాటు అవసరమైన మెటీరియల్‌ను అందుబాటులో ఉంచిందని ఇంజి నీర్లు, ఎంపిడిఒలు నిర్మాణ ఏజెన్సీ లను అన్ని విధాలుగా చైతన్యపరచి భవన నిర్మాణాలు నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశిం చారు.కార్యక్రమంలో పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె. చంటిబాబు, ఎంపిడిఒలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.










