సత్తెనపల్లి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాహన చట్ట సవ రణతో మోటార్ వాహనాల డ్రైవర్లపై పెనుభారం మోపాయని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేని శివాజీ అన్నారు. చేయూత ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు పట్టణ మహాసభ ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఎస్.సైదేశ్వరరావ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శివాజీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల ఫలితంగా మోటార్ వర్కర్ల జీవితాలు దుర్బరంగా మారాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని,ఇన్సూరెన్స్ ప్రీమియం విపరీతంగా పెంచారని, రూ.200 ఉన్న గ్రీన్ టాక్స్ రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. రోడ్ ట్యాక్స్ 30 శాతం పెంచారని రాష్ట్ర ప్రభు త్వం జీవో నెంబర్ 21 ద్వారా అన్ని రకాల ఫీజులు, పెనా ల్టీలు పెంచారని, చిన్న చిన్న పొరపాట్లకు కూడా భారీ మొత్తంలో పెనాల్టీలు విధిస్తున్నారని అన్నారు. స్పేర్ పార్ట్స్ పై 18 శాతం జిఎస్టి వసూలు చేస్తున్నారని, రాష్ట్రంలో రోడ్లు గుంతల మయంగా మారాయని, దీంతో వాహనాల మరమ్మతులు మరింత పెరిగి నిర్వహణ ఖర్చులు పెరిగా యని అన్నారు. చేయూత ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.హరిపోతురాజు మాట్లాడుతూ వాహన మిత్ర పథకం డ్రైవర్లు అందరికీ అమలు చేస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 12 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం రెండు లక్షల 60, వేల మందికి మాత్రమే వాహన మిత్ర అమలవుతోందని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కు వాహన మిత్ర పథకం వర్తింపచేయాలని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా వైద్యం ఖర్చు ప్రభుత్వం భరించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని అన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవాధ్యక్షులుగా ఎం.హరి పోతురాజు, అధ్య క్షులుగా నాలి రాజేంద్ర,కార్యదర్శిగా ఎ.వెంకటేశ్వర్లు, ట్రెజ రర్ గా పోలయ్యతో కలిపి 13 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.










