ప్రజాశక్తి-రావికమతం:సంక్రాంతి సందర్భంగా కవగుంటలో ముగ్గుల పోటీల విజేతలకు సర్పంచ్ దాసరి సూర్యకుమారి వరహాలు చేతల మీదుగా సోమవారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రాజన్న యూత్ సభ్యుల ఆర్థిక సహాయ సహకారాలతో ముగ్గుల పోటీలు నిర్వహించగా 23 మంది పాల్గొన్నారన్నారు. థింసా డాన్సులతో మహిళలు ప్రజలను ఉర్రూత లూగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, రాజన్న యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు.
మాకవరపాలెం:మాకవరపాలెం గ్రామంలో రామాలయం వద్ద గత మూడు రోజులుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించారు. భజనలు, చిడతలు, డాన్స్ వంటి పలు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
గొలుగొండ: మండలంలోని ఏఎల్‌పురం గ్రామం గొల్లపేటలో సంక్రాంతి సందర్భంగా కృష్ణ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీల నిర్వహించారు. ఈ పోటీల్లో 54 మంది మహిళలు పాల్గొన్నారు. గొలుగొండ ఎంపిపి గజ్జలపు మణికుమారి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తప్పెటగుళ్లు, కోలాటం కార్యక్రమాలు నిర్వహించారు.
లింగంపేట గ్రామంలో యువతీ యువకులు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. టిడిపి ఆధ్వర్యంలో స్లో సైక్లింగ్, లెమన్ స్పూన్, క్విజ్, చిత్రలేఖనం తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు మంచి స్పందన లభించినట్లు టిడిపి నేత శ్రీకాంత్ తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కోటవురట్ల: మండలవ్యాప్తంగా పలు గ్రామాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. కోటవురట్ల గ్రామంలో పెద్ద సంఖ్యలో మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. పాములవాక గ్రామంలో టిడిపి నాయకులు జనార్ధన్, వైసిపి నాయకులు కిల్లాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు,
చీడికాడ: మండలంలోని సిరిజాం గ్రామంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా పైడితల్లమ్మ అమ్మవారి తీర్థ మహౌత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎడ్ల బళ్ల పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించిన విజేతకు పైలా తన వంతుగా రూ.8 వేలు బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పైలాతో పాటు మాజీ సర్పంచ్ పంచాడ దాలినాయుడు, గండి ముసిలి నాయుడు,స్వామి నాయుడు,కన్నూరు లక్ష్మి నాయుడు, కామిరెడ్డి ఎరుకు నాయుడు,చీడికాడ పైలా యువసేన అధ్యక్షుడు దొగ్గా బలరాం పాల్గొన్నారు.
మునగపాక రూరల్: మండలంలోని పాటిపల్లిలో మాజీ సర్పంచ్ ఆడారి అప్పలనాయుడు జ్ఞాపకార్థం స్పందించే హదయం చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు చేసిన నత్యాలు, గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచులను పంపిణీ చేశారు. సర్పంచ్ ఆడారి కష్ణవేణి, నిర్వాహకులుఎస్ తమ్మి రాజు, ఆడారి రామ్మోహన్ రావు, కె,వి రమణ పాల్గొన్నారు.
మునగపాక రూరల్: సంక్రాంతి సంబరాలలో భాగంగా దాడి అప్పలనాయుడు పర్యవేక్షణలో స్థానిక బైపాస్ జంక్షన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ఎడ్ల బళ్ల పోటీలు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజరు కుమార్, విద్యార్థి వెంకట్రావు బహుమతులను అందజేశారు.
స్థానిక సాయిబాబా ఆలయంలో తన తల్లి అచ్చయ్యమ్మ జ్ఞాపకార్థం సర్పంచ్ దిమ్మల అప్పారావు సొంత నిధులతో 300 మందికి పేదలకు, వద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు.స్థానిక నందీశ్వర కళాప్రాంగణం ఆవరణలో ప్రవాసమిత్ర ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు.
దేవరాపల్లి : మకర సంక్రాంతి పండగను పురస్కరించుకొని ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల రంగవళ్లులు కళకళలాడాయి. ముగ్గులు వేసేందుకు ఆడపిల్లలు ఆసక్తి చూపించారు.
అచ్యుతాపురం : తిమ్మరాజుపేటలో సర్పంచ్ సరగడం భాగ్యలక్ష్మి శివబాపునాయుడు, మణికంఠ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. తిమ్మరాజుపేట జంక్షన్‌లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. కొండకర్ల గ్రామంలో జిల్లాస్థాయి చెడుగుడు పోటీలను వైసిపి నేత అంజిరెడ్డి ప్రారంభించారు. తిమ్మరాజుపేట, జగ్గన్నపేటల్లో అన్నసమారాధన నిర్వహించారు.
బుచ్చయ్యపేట : మండలంలోని కొండెంపూడిలో జనసేన, టిడిపి యూత్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
వడ్డాది: సంక్రాంతిని పురస్కరించుకుని బంగారమెట్టలో శ్రీ అచ్చమ్మ పేరంటాలు తీర్థం నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎడ్లబళ్ల పరుగుపందెం, పిడతల పోటీలు నిర్వహించారు విజేతలకు టిడిపి చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్య బాబు బహుమతులు అందజేశారు. స్థానిక నాయకులు సాయం రమేష్ సర్పంచ్ మెరుగు కుమారి బాబురావు ఎంపిటిసి ఎల్లపు జగ్గారావు పాల్గొన్నారు.
సబ్బవరం : మండలంలోని ఆసకపల్లి గ్రామంలో బంగారమ్మ అమ్మవారి సన్నిధిలో పిఎసిఎస్ చైర్మన్ కాపుశెట్టి శేషుబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గులు పోటీలు నిర్వహించారు. 90 మంది మహిళలు పాల్గొనగా, విజేతలకు బహుమతులు అందజేశారు.ఉప సర్పంచ్ కరణం సురేష్, ధూళి నరేష్, కరణం రమణ, నక్క అప్పారావు, దువ్వు దుర్గాలు, రౌతు కిరణ్, బొండా పాండు పాల్గొన్నారు.










