కడప సిటీ : నగరంలోని మతుంజయకుంట తొగటవీరక్షత్రీయ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం వద్ద 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తొగటవీర క్షత్రీయ సంఘం జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ, కళ్యాసుధాకర్, జిల్లా అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా ప్రధాన కార్యదర్శి బందా శంకర్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో నగరం వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా నరసింహరావు, నగర కోశాధికారి టేకూరి సుదర్శన్, గౌరవాధ్యక్షులు ఉమ్మడి శెట్టి సుబ్రమణ్యం, పల్లా బాలచౌడన్న, గోవిందు వెంకటరమణ, వెలిగండ్ల సుబ్బరాయుడు, దోండ్ల వెంకటరమణ, సంఘం సభ్యులు సుంకర శివశంకర్, కురకూటీ వెకట సుబ్బన్న టేకూరి పుష్పాంగధ, సాన లక్ష్మీ నారాయణ, గుండ్లపల్లె ఆంజనేయులు, బోళీశెట్టి సుబ్బయ్య, అంజనేయులు సంఘం నాయకులు పాల్గొన్నారు. బిసి భవన్‌లో.. 77వ స్వసంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత రిమ్స్‌లోని బిసి కార్యాలయంలో జాతీయ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తల లింగమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షలు బంగారు నాగయ్య, కడప మార్కెట్ చెర్మన్ బంగారు గంగాదేవి, .జిల్లా వర్కగ్ ప్రసిడెంట్ గోవింద్ నాగరాజు, ఉపాధ్యక్షులు కాలే సుధాకర్, సుంకేసుల ఖాదర్ బాషా, పస్తం అంజి,యువజన జిల్లా అధ్యక్షులు సిఆర్‌ఐ సునీల్, గంగయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, తోరివేముల జయశ్రీ జింక జయలక్ష్మి , షేక్ బిబిచాన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో.. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతమ్‌రెడ్డి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకట్రామిరెడ్డి, చీకటి చార్లెస్, కొపూరు శ్రీనివాసులు, జిల్లా నాయకులు చెప్పలి పుల్లయ్య, కుళ్లాయప్ప, మధు రెడ్డి,మామిళ్ళ బాబు, ఖాదర్ ఖాన్, నగర నాయకులు ఆనందు, లావణ్య ,ఆసిఫ్ ఖాన్ పాల్గొన్నారు. జిల్లా స్పోర్ట్స్ స్టేడియంలో స్టెప్ సిఇఒ సి. సాయి గ్రేస్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. కార్య్రమంలో క్రీడాకారులు, వాకర్స్, డిఎస్‌ఎ చీఫ్ కోచ్ అమతరాజ్, కోచ్‌లు, స్టెప్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంటిమిట్ట : మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. తహశీల్దార్ మాధవిలత తమ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. డిప్యూటీ ఎంపిడిఒ రంగయ్య, సిఐ కార్యాలయంలో సిఐ పురుషోత్తం రాజు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మధుసూదన్‌రావు జెండా వందనం చేశారు. బి. కోడూరు : మండల కేంద్రమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ వినీత్ రాజు, డాక్టర్ .వినరు కుమార్ ఆరోగ్య సిబ్బంది, మండల తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ విద్యాసాగర్, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి ఎఒ రమణయ్య, గోవిందయ్యపల్లి జడ్‌పి హెచ్ స్కూల్ హెచ్‌ఎం పుల్లయ్య, అన్ని ప్రభుత్వ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. చింతకొమ్మదిన్నె : మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల్లో మువ్వెన్నల జెండా ఎగురవేశారు. ఎంపిడిఒ కార్యాలయంలో జడ్‌పిటిసి నరేన్‌రెడ్డి, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నారాయణరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రాఘవేంద్ర, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో డాక్టర్ సుధాకర్‌రెడ్డి, భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో కరస్పాండెంట్ ఫరూక్ అహ్మద్, కెవికెలో డాక్టర్ వీరయ్య ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవి కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు గూడా ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసురెడ్డి, శ్రీరాములు రెడ్డి, వెంకట్ రెడ్డి, స్థానిక పంచాయతీ సెక్రెటరీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక భగత్ సింగ్ నగర్‌లో దిన్నెపాటి బసిరెడ్డి వికాస్ స్కూల్‌లో 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కరస్పాండెంట్ బసిరెడ్డి త్రివర్ణ ప్రతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పిల్లలకు చిత్రలేఖన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. వల్లూరు : మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ పెద్ద ఓబన్న జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో ఎఎస్‌ఐ మోహన్‌రావు, హెడ్ కానిస్టేబుల్ కె మధుసూదన రాజు, ఓబుల్ రెడ్డి, నాగార్జున, ప్రసాద్ రాజు, నాగరాజు పాల్గొన్నారు. కలసపాడు : స్థానిక సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో 77వ స్వతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల వ్యవస్థపకులు చిత్త బాల్రెడ్డి సతీమణి చిత్త జయమ్మ, కరెస్పాండెంట్ చిత్తా రాజశేఖర్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్త ప్రభావతి హాజరై పతాకావిష్కరణ చేశారు. అనంతరం జాతీయ సమైక్యత భావంలో భాగంగా భగవద్గీత, ఖురాన్, బైబిల్, మొదలగు అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం సాంస్కతి కార్యక్రమాలతో విద్యార్థులు ప్రజలను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల పిఇటిలు ఎం. ప్రసాద్‌రావు, కోమల మేరీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్ ) : స్థానిక రాణి తిరుమలదేవి డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ టి.చంద్రశేఖరరెడ్డి జెండా వందనం చేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ తరునేందు శేఖర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి, సుబ్బరాయుడు, సరితరెడ్డి, రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రొద్దుటూరు టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్ జివి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టిబి రోడ్డులోని తన కార్యాలయం వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. సింహాద్రిపురం : మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి అరుణ, రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ మహబూబ్ బాషా, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రోషన్, మార్కెట్ యార్డ్ కార్యాలయంలో చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వివేకానంద పాఠశాలలో ప్రిన్సిపల్ ఖాదర్‌బాషా, కరస్పాండెంట జాఫర్ జెండాను ఎవరు వేశారు. ఇందిరానగర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్‌రెడ్డి జెండా వందనం చేశారు. ఎంపిడిఒ కృష్ణమూర్తి, మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి శివ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు పెద్దముడియం : ఎంపిడిఒ వెంకటరమణ సమక్షంలో విద్యార్థులతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.ముద్దనూరు : 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలు, పోలీస్‌స్టేషన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు జాతీయ పతాకం ఎగురవేసి జెండా వందనం చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు, చిన్నారులు వివిధ స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో అలరించారు. వేంపల్లె : వేంపల్లె మండల వ్యాప్తంగా మంగళవారం జాతీయ జెండా రెపరెప లాడింది. మార్కస్ మదరసాలో మదరసా కమిటీ అధ్యక్షులు షెక్షావలి, ఆసీఫ్, రఫీ జెండా ఎగుర వేశారు. పోలీసుస్టేషన్‌లో సిఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి లక్ష్మి గాయత్రి, దారుల్ ఉల్మ్ మదరసా, గ్రామ పంచాయతీ, ఉర్దూ, బాలుర పాఠశాలల్లో సర్పంచు రాచినేని శ్రీనివాసులు, ఉషాకిరణ్ పాఠశాలో కరస్పాండెంట్ రమణారెడ్డి, శ్రీచైతన్య పాఠశాలలో చక్రపాణిరెడ్డి, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటిలో డైరెక్టర్ సంధ్యారాణి, నారాయణ పాఠశాలలో కరస్పాండెంట్ నారాయణరెడ్డి, స్వామి వివేకానంద పాఠశాలలో కరస్పాండెంట్ రామాంజనేయురెడ్డి, వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు, వికాష్ పాఠశాలలో పాఠశాల వ్యవస్థాపకుడు నజీర్‌బాషా, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ ఎస్‌ఎఫ్ బాషా, ముబీనా, ప్రభుత్వ బాలికల పాఠశాలలో కెనరా బ్యాంకు మేనేజర్ మనోజ్ కుమార్, కుమ్మరాంపల్లె పాఠశాలలో సర్పంచు మునేష్, ఎస్సీ బాలుర వసతిగృహంలో ఎంపిపి లక్ష్మి గాయత్రి, మండల కన్వీనర్ చంద్రఓబుల్‌రెడ్డి, బిసి బాలికల వసతిగృహంలో మాజీ సర్పంచు సుబ్బారెడ్డి, టిడిపి కార్యాలయంలో మండల కన్వీనర్ రామమునిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నాగన్న, హాస్టల్ వార్డెన్ మాణిక్యరావు పాల్గొన్నారు. చాపాడు : 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో ఎంపిపి లక్ష్ముమయ్య జెండాను ఆవిష్కరించారు. ఎంపిడిఒ శ్రీధర్ నాయుడు, ఎంఇఒ రవిశంకర్, ఎఒ రామానుజం, ఇఒపిఆర్‌డి రాధాకృష్ణ వేణి పాల్గొన్నారు. తహశీల్దార్ సుభాని తన కార్యాలయంలో, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మైనుద్దీన్ జెండా వందనం చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ప్రమీల, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, సర్వేయర్ సాయిలత, విఆర్‌ఒలు, సచివాలయ సర్వేయర్లు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు జండా వందనం చేసి వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మైదుకూరులో మేధా విద్యా సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఊరేగించారు. మేధా జూనియర్ కళాశాల నుండి మేధా డిఫెన్స్ అకాడమీ వరకు వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. శకటంపై భరతమాత, స్వాతంత్ర సమరయోధుల వేషాలతో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. మేధా డిఫెన్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ కల్నల్ కందనూరు గోపి, మేధా విద్యా సంస్థల చైర్మన్ చెన్నంశెట్టి నరసింహులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జమ్మలమడుగు : మహనీయులు త్యాగాలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వేల్పుల శివమ్మ, వైస్ చైర్మన్ పోరెడ్డి రామలక్ష్మమ్మ, మంగదొడ్డి సింగరయ్య, మున్సిపల్ కమిషనర్ జి.వెంకటరామిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, డైరెక్టర్ మార్బుల్ శీను, సచివాలయ ఉద్యోగులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. బ్రహ్మంగారిమఠం : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జడ్‌పి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాఠశాల వద్ద నుండి అయిదురోడ్ల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహంచారు. స్వాతంత్య్ర అమరవీరుల చిత్రపటాలకు అడిషనల్ ఎంఇఒ జి.వెంకటేశ్వర్లుతో పూలమాల వేయించి నివాళులర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు, రాజశేఖర్, అజరు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, బాల గుర్రయ్య, మండల నాయకులు దేవా, అరవింద్, సందీప్, జగదీష్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. లింగాల : స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మండలంలో జాతీయ జెండా రెపరెపలాడింది. ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి రమాదేవి, తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ రిషికేశవరెడ్డి, జూనియర్ కళాశాల, ఐటిఐ కళాశాల, జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ సచివాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన ఎంపిడిఒ సురేంద్రనాథ్ కడపలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ విజరురామరాజు, జడ్పీ సిఇఒ సుధాకర్, చైర్మన్ అవార్డు ఇచ్చారు. జమ్మలమడుగు రూరల్ : స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి వి. శివనారాయణ అన్నారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆటో స్టాండులో సిపిఎం పట్టణ కార్యదర్శి వీరణాల శివనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, పాములేటి, మున్నా, నాగేశ్వరరెడ్డి, రాజేష్ పాల్గొన్నారు. చక్రాయపేట : చక్రాయపేటలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఘనంగా నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వినోద్‌కుమార్ జండా ఆవిష్కరణ చేశారు. వెలుగు కార్యాలయం వద్ద ఎపిఎం ఆంజనేయులు, తహశీల్దార్ కార్యాలయం వద్ద రాజసింహ నరేంద్ర, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి మాధవి బాలకృష్ణ, మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద సిఆర్పిలు కొండారెడ్డి, మోహన్ రావు, స్వర్ణలత, పారిశ్రామిక శిక్షణ కేంద్రం వద్ద ప్రిన్సిపాల్ వై. రాధాకృష్ణయ్య మువ్వన్నెల జెండా ఎగురవేశారు. వెలుగు కార్యాలయంలో నిరంతరం పనిచేసేన వారికి ఎపిఎం ఆంజనేయులు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఆదర్శ రైతులకు ప్రశంసాపత్రాలనిచ్చి వారిని ప్రోత్సహించారు. ఐటిఐలో పలు ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణ తెలిపారు. గండి క్షేత్రంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి, చైర్మన్ పినుబోలు రాఘవేంద్ర ప్రసాద్, గండి గురుకుల పాఠశాల సురేంద్రబాబు జెండా ఆవిష్కరణ చేశారు. కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గండి దేవస్థాన ప్రధాన అర్చకుడు వర్త కేసరి స్వామికి ప్రశంసాపత్రం అందుకోపోవడంతో ముకుందరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పులివెందుల రూరల్ : 77 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా మంగళవారం పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో తొండూరు మండల ఇన్‌ఛార్జి వైయస్ మదన్‌మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నప్ప జెండా వందనం చేశారు. అనంతరం దేశ సరిహద్దులలో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన విశ్రాంత సైనికులు శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రాజాలు, శంకర్ నారాయణ, ప్రతాప్‌రెడ్డిలను సన్మానించారు. కార్యక్రమంలో చిన్నప్ప, వైయస్ మదన్‌మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్వోత్తమ్‌రెడ్డి, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు పాల్గొన్నారు. పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాను ఎగరవేశారు. మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో పురపాలక చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు జాకీర్, నరసింహలు, మహేష్, నాయక్, నాయకులు, కోళ్ల భాస్కర్, సూరి, గైకేశ్వర్, మార్కెట్ యార్డ్ సూపర్వైజర్స్ రామకృష్ణ, మురళి, అరుణ్, మార్కెట్ యార్డ్ సిబ్బంది, పురపాలక వైస్ చైర్మన్ హఫీజ్, కౌన్సిలర్ కోడి రమణ, మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ప్రొద్దటూరు : పట్టణంలో పలువురు అధికారులు, నాయ కులు, పాత్రికేయులు 77వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్‌లో 100 అడుగుల మువ్వన్నెల జెండాకు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి సెల్యూట్ చేసి ప్రసంగించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ లకిëదేవి, కమిషనర్, వైసిపి నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ కార్యాలయంలో ఇన్‌ఛార్జి నజీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యంశర్మ ముఖ్య అతిధిగా ప్రసంగించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు జిలానీబాషా పాల్గొన్నారు. ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షులు సరస్వతిరెడ్డి, కార్యదర్శి ఉషారాణి, సృజన, కళ్యాణి పాల్గొన్నారు.










