May 01,2023 22:19

      మేడే వేడుకలను జిల్లా వ్యాప్తంగా సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్మికుల హక్కులను, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి - ఉంగుటూరు

నారాయణపురంలో పలువురు తాపీ కూలీలను సర్పంచి దిడ్ల అలకనంద, పంచాయతీ పాలకవర్గ సభ్యులు సత్కరించారు. చేబ్రోలులో సిఐటియు కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు. సీరా అప్పారావు, కొక్కిరపాటి వెంకట్రావు పాల్గొన్నారు. ఉంగుటూరు, వెల్లమిల్లి, కైకరం పలు గ్రామాల్లో మేడే వేడుకలు నిర్వహించారు.
ఆగిరిపల్లి : మండల కేంద్రమైన ఆగిరిపల్లితో సహా పలు పలు గ్రామాలల్లో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆగిరిపల్లి పురవీధులల్లో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆగిరిపల్లి మెయిన్‌ సెంటర్‌ వద్ద ఉన్న అమర వీరుల స్థూపం వద్ద సత్తు కోటేశ్వరరావు, బండి కోటయ్య, ఆగిరిపల్లి సుందరయ్య నిలయంలో నైనవరపు ఉలక్కయ్య, సెంటర్‌లో జహాంగీర్‌భాషా, కుశలవ కంపెనీ వద్ద రాధదుర్గ, గొల్లగూడెం సెంటర్‌లో రామకృష్ణ,అ ంబేద్కర్‌ కాలనీలో కె.రాజు, సుందరయ్య నగర్‌లో ఎం.కోటేశ్వరరావు, ఈదుల గూడెంలో స్టాలిన్‌, కలటూరులో జోజి, కొమ్మూరులో జి.పాపా రావు జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.చంటి, కెవికె.ప్రసాద్‌, ఎం.నరేష్‌, రవీంద్ర, స్వామియేలు పాల్గొన్నారు.
            టి.నరసాపురం : మండలంలోని అల్లూరి సీతారామరాజునగర్‌, రామమ్మగూడెం, అబ్దుల్లాపురం, సాలి గూడెం, మక్కినవారిగూడెం గ్రామాలో సిపిఎం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు అను మాలు మురళి, మడకం సుధారాణి, పూసం చిన్న సూర్యరావు, మడకం కుమారి, సరియం దుర్గమ్మ పాల్గొన్నారు.
          ద్వారకాతిరుమల : శ్రీ ద్వారకా శ్రీనివాస భవన్‌ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు స్తూపం వద్ద జెండా ఎగురవేసి నినాదాలు చేశారు. ప్రెసిడెంట్‌ బండారు శివాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రావు, వీర్రాజు, నాగరాజు, వైస్‌ ప్రెస ిడెంట్‌ నాగరాజు, సిఐటియు జిల్లా సభ్యులు ఆది కృష్ణ, దాసరి శ్రీనివాసరావు, సూరా గోపి, బొంతు సింహాచలం, మునీశ్వరరావు పాల్గొన్నారు.
         మండవల్లి : స్థానిక సెంటర్‌లో కార్మికుల జెండాను బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు రాము ఎగురవేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురా లు విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్య క్షురాలు చెల్లమ్మ, ఉమాదేవి, జయలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు.
            ముదినేపల్లి : స్థానిక గురజ రోడ్డు సెంటర్‌ వద్ద, మండలంలోని సింగరాయపాలెం సెంటర్‌లో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్‌ మాట్లాడారు. అనంతరం రెండు సెంటర్లలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటోవర్కర్సు యూనియన్‌ ప్రెసిడెంట్‌ సుబ్బారావు అంగన్‌వాడీ, ఆశావర్క ర్లు జ్యోతి, కమల పద్మ, ఆటో కార్మిక సంఘం నాయకులు, కెవి పిఎస్‌ నాయకులు దాకరపు నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిన్నం మాధవ పాల్గొన్నారు.
           కొయ్యలగూడెం : సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘం ఆధ్వర్యంలో కొయ్యలగూడెం సిఐటియు కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు శుక్ల బోయిన రాంబాబు జెండా ఆవిష్కరించి మాట్లాడారు. సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శి కెవి.సత్యనారాయణ మాట్లా డారు. చేపలపేటలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జనా జగ్గారావు ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. పలు రంగాల కార్మికులు జెండాలు ఎగురవేశారు.
           పెదవేగి : సిఐటియు, వ్యవసాయ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ అనంతరం సభలు నిర్వ హించారు. ఈ సభలో ఎ.శ్యామలారాణి మాట్లాడారు. ఈ కార్య క్రమంలో సిఐటియు పెదవేగి మండల కార్యదర్శి పి.ప్ర సాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అప్పల స్వామి, బిల్డింగ్‌ రంగం నాయకులు ఎం.శ్రీనివాస్‌, నాగరాజు, రమేష్‌, పంచాయతీ కార్మికులు, ఆశావర్కర్స్‌ యూనియన్‌ బి.రోజా, మార్కెట్‌ యార్డ్‌ హమాలీ కార్మికులు పాల్గొన్నారు.
          ముసునూరు : మండలంలోని 16 గ్రామాల్లో సోమవారం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి పిల్లి మురళి ఆధ్వర్యంలో జెండా వందనం చేసి పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయులకు నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గంగుల సత్యం, శ్రీను, పోటు శ్రీను, కంచర్ల శ్రీను, కంచర్ల దుర్గారావు పాల్గొన్నారు.
            చాట్రాయి : సిఐటియు మండల కార్యదర్శి కొలికిపోగు భాస్కరరావు ఆధ్వర్యంలో చాట్రాయిలోని తాపీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జనార్ధనవరం, ఆరుగొలనుపేట, గ్రామాల్లో తాపీ వర్కర్స్‌ యూనియన్‌ ఏకశిరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చనుబండలో, ఎలక్ట్రికల్‌ యూనియన్‌ తీర్థాల అద్భుతరావు ఆధ్వర్యంలో పోలవరంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు చాగంటి రాజారావు ఆధ్వర్యంలో చిన్నంపేటలో, కుల వివక్షత వ్యతిరేక పోరాట కమిటీ సంఘం మండల కార్యదర్శి కొమ్ము ఆనందం ఆధ్వర్య ంలో కోట పాడులో సిఐటియు కమిటీ సభ్యులు టిఎన్‌ఎం.సూరి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
            బుట్టాయగూడెం : కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు హరించి వేస్తున్నాయని సిఐటియు సహాయ కార్యదర్శి ఎం.నాగమణి విమర్శించారు. మే డే స్ఫూర్తితో కార్మిక, కర్షక ఐక్యతతో హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. బుట్టాయగూడెం, రెడ్డిగణపవరం, దొరమామిడి, కోట రామచంద్రపురంలో సిఐటి యు, జెండాలను ఎగురవేశారు.
           దెందులూరు : కొవ్వలి ఆటో యూనియన్‌ స్టాండ్‌లో ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి జె.గోపి సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన ర్యాలీని ఎఐఎల్యు నాయకులు సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. రమేష్‌, రాము కొవ్వలిలో ఆటో ర్యాలీకి నాయకత్వం వహించారు.
          పెదపాడు : సిఐటియు, సిపిఎం, భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆశ వర్కర్స్‌ యూనియన్‌, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెదపాడులో మేడే కార్యక్రమాలను నిర్వ హించారు. స్థానిక నాయుడుగూడెం రోడ్డులో నర్రా ఆంజనేయులు భవనం, బస్టాండ్‌ సెంటర్‌, వట్లూరు రోడ్‌, పాలకేంద్రం, గ్రంథాలయం, గని చెరువుగట్టు, నాయుడుగూడెంలో సిఐటియు, సిపిఎం జెండాలను ఎగురవేశారు. అనంతరం మేడే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు పి.దుర్గ, మండల కార్యదర్శి రెడ్డి లక్ష్మణరావు, రైతు సంఘం మండల అధ్యక్షులు లింగం కృష్ణారావు, కార్యదర్శి గుండపనేని సురేష్‌, వ్యకాస నాయకులు షేక్‌ కరీముల్లా పాల్గొన్నారు.
           పోలవరం : పోలవరం పంచాయతీ కార్యాలయం వద్ద సిఐటియు, సిపిఎం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల గౌరవ అధ్యక్షులు బంగారు కృష్ణ, గిరిజన సంఘం కార్యదర్శి బొరగం భూచందర్రావు, సిఐటియు కార్యదర్శి పిఎల్‌ఎస్‌.కుమారి, సిఐటియు అధ్యక్షులు పి.కృష్ణ, వ్యవసాయ సంఘం కార్మికులు సముద్రాలు సాయి కృష్ణ, కార్పెంటర్‌ ప్రెసిడెంట్‌, తుమ్మి రాడా పోసిబాబు సెక్రటరీ లింగోజి భాస్కరరావు, పసుపులేటి భాస్కరరావు, సారేపల్లి జగదీష్‌, లింగోజి పోసిబాబు పాల్గొన్నారు.
           కలిదిండి : స్థానిక ప్రధాన సెంటర్‌లోని రిక్షా స్టాండ్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఎగురవేశారు. స్వీట్స్‌ పంచారు. తొలుత మార్కెట్‌ యార్డ్‌ కార్యాలయం నుంచి ప్రధాన సెంటర్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహి ంచారు. మండలంలోని పెదలంక, మూలలంక, భాస్కరరావ ుపేట, గుర్వాయిపాలెం, సానారుద్రవరం, చిన తాడినాడ, కొరుకొల్లు గ్రామాల్లో ప్రజాసంఘాలు, సిపిఎం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి మహంకాళరావు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
           నిడమర్రు : సిపిఎం, సిఐటియు, కార్మిక సంఘాల కమిటీ ఆధ్వర్యంలో నిడమర్రు, భువనపల్లి పెదనిం డకొలను, అడవికొలను, చానమిల్లి, భావయిపాలెం గ్రామాల్లో జెండా ఆవిష్కరించారు. నిడమర్రు ప్రజా సంఘాల కార్యాల యం వద్ద పిల్ల హరికుమార్‌ అధ్యక్షుతన నిర్వహించిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమణరావు మాట్లాడారు.
         జీలుగుమిల్లి : జీలుగుమిల్లి సిఐటియు స్థూపం వద్ద మండల కార్యదర్శి చిట్టిబొమ్మ కొండలరావు ఆధ్వర్యంలో జెండా వందనం చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు ఆధ్వర్యంలో జెండా వందనం చేసి కార్మికుల కోసం పోరాడి అమరులైన కార్మిక సోదరు లకు సెల్యూట్‌ చేశారు. స్థానిక పశువుల హాస్పిటల్‌ సమీపంలో రైతు సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. కార్యదర్శి సీతారామ య్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరిం చారు. అంబేద్కర్‌ కాలనీలో ఐద్వా కార్యదర్శి నేలటురి నిర్మల జెండా ఆవిష్కరించారు.
        జంగారెడ్డిగూడెం : ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకను పురస్కరించుకుని స్థానిక వికాస్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్‌ కార్మికులు, ఆటో వర్కర్స్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌, ఆర్‌టిసి వర్కర్లు ఘనంగా మేడే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వికాస్‌ విద్యాసంస్థల అధినేత జగన్‌ మాట్లా డుతూ తల్లిదండ్రులు లేని పిల్లలకు, పేద కుటుంబాల పిల్లలకు వికాస్‌ విద్యాసంస్థలో ఉచితంగా విద్యను అందిస్తామని తెలిపారు. కార్మికులకు ఎరుపు కండువాలను అందించారు.
ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ సభ్యులు వాస సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక ప్రియదర్శని కళాశాలలో దళిత బహుజన సంఘాల జెఎసి నాయకులు ప్రియదర్శిని కళాశాల అధినేత డాక్టర్‌ అలుగు ఆనంద శేఖర్‌ అధ్యక్షతన మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది పాటు వాటర్‌ వర్క్స్‌లో, మున్సిపల్‌ పరిధిలో పనితనం చూపించిన దోసూరు నాగరాజు, కొండపల్లి సుబ్రహ్మణ్యం, పొడపాటి గంగాధర్‌రావులకు ప్రోత్సా హకాలు, బహుమతులు అందించి పూలతో దుశ్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్‌ గర్శికూటి రాంబాబు, మానుకొండ కిషోర్‌, మల్లిపూడి రవి, శేఖర్‌, పేర్రాజు, శ్రీను, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.
           నూజివీడు రూరల్‌ : పట్టణంలో ఎఐటియుసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద నుంచి పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్‌, చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌, మున్సిపల్‌ కార్యాలయం సెంటర్‌ మీదుగా బస్టాండ్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో చలసాని రామారావు, బత్తుల వెంకటేశ్వరరావు, చాట్ల పుల్లారావు పాల్గొన్నారు. తుక్కులూరులో సిపిఎం శాఖ కార్యదర్శి బందెల బాబురావు జెండా ఆవిష్కరించారు.