సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 27వ వర్థంతి కార్యక్రమాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్‌టిఆర్ వర్థంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ప్రజాశక్తి-అనకాపల్లి
ఎన్టీ రామారావు 27వ వర్ధంతి పురస్కరించుకొని పట్టణంలో టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం వద్ద మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పట్టణ బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. బెల్లం మార్కెట్, విజయరామరాజుపేట, గవరపాలెం పరమేశ్వరి పార్క్, ఎన్టీఆర్ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లోనూ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ నారాయణరావు, మల్ల సురేంద్ర, కోట్ని బాలాజీ, ఎం.నీలబాబు, బిఎస్‌ఎన్‌కె.జోగినాయుడు, బొద్దపు ప్రసాద్, పోలవరపు త్రినాధ రావు పాల్గొన్నారు.
కశింకోట : కశింకోటలోని ఎన్‌టిఆర్, బసవ తారకం విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పూలమాల వేశారు. పార్టీ నాయకులు కాయల మురళి, ఉగ్గిన రమణమూర్తి, పెంటకోట రాము, సిద్ధిరెడ్డి శ్రీనివాసరావు, వేగి గోపీకృష్ణ, ఎంపిటిసి షేక్ దర్గా, జగన్నాధం, షేక్ బాబర్ పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని దిబ్బిడి, బుచ్చయ్యపేట, రాజాం గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు టిడిపి నాయకులు పూలమాలలు వేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్య బాబు చేతుల మీదుగా పేదలకు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మర్షా సతీష్, గన్నాబత్తుల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ నాగులపల్లి సత్యనారాయణ, ఉపసర్పంచ్ చిన్ని పైడిరాజు పాల్గొన్నారు.
వడ్డాది : బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట జంక్షన్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి బత్తుల తాతయ్యబాబు శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ నాయకులు తమరాన దాసు, గోకివాడ కోటేశ్వరరావు, దొండా శ్రీను, సాయం శేషు, దొండా నరేష్, సిరిగిరి శెట్టి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.
అచ్యుతాపురం:మండలంలోని పూడిమడక, తిమ్మరాజుపేట, జగ్గన్నపేట, మోసయ్యపేట, ఎం.జగన్నాధపురం గ్రామాల్లో ఎన్టీఆర్ చిత్రపటాలకు, విగ్రహాలకు నివాళులర్పించారు. పూడుమడకలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పూడిమడక, మోసయ్యపేటలో చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు, నాయకులు రాజాన రమేష్ కుమార్, లాలం భాస్కరరావు, మెరుగు బాబు నాయుడు,
పుర్రె శ్రీనివాసరావు, జనపరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి మండల అధ్యక్షులు రంగలి మహేష్ ఆధ్వర్యంలో పార్టీ నియోజవర్గ పరిశీలకులు లోగడ కృష్ణ, ఇన్‌ఛార్జి పివిజి.కుమార్, సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సబ్బవరం : స్థానిక మూడు రోడ్ల జంక్షన్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకపల్లి, ఇరువాడ గణపతినగర్‌లో మిడతాడ మహాలక్ష్మి నాయుడు, రేసుపూడి రమణ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్‌కు నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు బండారు అప్పల నాయుడు, పీలా శ్రీనివాసరావు, గండి రవి కుమార్, గండి ముత్యాల నాయుడు, గండి దేముడు, కోటాన అప్పారావు, సర్పంచ్ దెడ్డము ప్రసాదరావు, ఎంపీటీసీ గొర్లి చైతన్య పాల్గొన్నారు.
చోడవరం : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చోడవరం టిడిపి కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మల్లు నాయుడు, టిడిపి మండల అధ్యక్షుడు బొడ్డేటి నాగ గంగాధర్, యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్.రాజు, నాయకులు బత్తుల తాతయ్య బాబు, బుద్ధ నాగ జగదీశ్వరరావు, లక్ష్మీనారాయణ, గోకివాడ కోటేశ్వరరావు, వియ్యపు అప్పారావు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : చోడవరంలో టిడిపి కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరంలో మండలంలోని దిబిడి గ్రామానికి చెందిన సేనాపతి మణికంఠ, పెదిరెడ్ల మాణిక్యం, వియ్యపు రాము, జర్థ చిరంజీవి, మంత్రి మహేష్, బంటు సాయి, డి గణేష్ రక్తదానం చేశారు.
నర్సీపట్నం రూరల్:తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతిని పట్టణంలో టీడీపీ శ్రేణుల బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ధనిమిరెడ్డి మధు, శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ పైల గోవిందరావు, రావాడ నాయుడు, జాలమూరి బంగార్రాజు, టీడీపీ నాయకులు రాజేష్, కొరుప్రోలు శ్రీసు, జంపన నాగేంద్రరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.
కొత్తకోట:టి.అర్జాపురం, మేడివాడ, రావికమతం, కొత్తకోట, గంపవాని పాలెం గ్రామాలలో ఎన్‌టిఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.జెడ్ కొత్తపట్నంలో టిడిపి నాయకులు గాలి రమణ, తాతాజీ, నాయుడు, తారకం ఆధ్వర్యంలో అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌ఎన్‌ఎస్ రాజు, చోడవరం టిడిపి ఇన్‌ఛార్జ్ బత్తుల తాతయ్యబాబు, చక్కర కర్మాగారం మాజీ చైర్మన్ గునూరు మల్లు నాయుడు, టిడిపి మండల అధ్యక్షులు రాజాన కొండనాయుడు, టి. అర్జాపురం సర్పంచ్ ఎం.అర్జున, కొత్తకోట మాజీ సర్పంచ్ కోట నీలవేణి, గోవిందరావు, కోట సత్తిబాబు పాల్గొన్నారు.
కోటవురట్ల: మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి మండల అధ్యక్షులు జానకి శ్రీనివాసరావు, జల్లూరులో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కాశి నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోటవురట్ల ఎంపీటీసీ సభ్యులు పి.సూర్యారావు, టిడిపి సీనియర్ నాయకులు వేచలపు భాస్కరరావు, జానకి హరిబాబు, పాల్గొన్నారు.
మాకవరపాలెం:మండలలోని తామరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షులు రుత్తుల యర్రా పాత్రుడు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు కోసూరు శ్రీను, సర్పంచ్ అల్లు రామ నాయుడు, మాజీ జెడ్పీటీసీ కుమార్, సర్పంచ్ దుంగల వెంకటరమణ, మాజీ వైస్ ఎంపీపీ వెంకటరమణ, సర్పంచ్ నందకిషోర్ పాల్గొన్నారు. నర్సీపట్నం టౌన్:ధర్మసాగరంలో జడ్పిటిసి సుకల రమణమ్మ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళ్లు అర్పించారు. ఎన్‌టిఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
నక్కపల్లి:నక్కపల్లిలో తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ , నాయకులు కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి కొండబాబు, బుజ్జి, దేవర సత్యనారాయణ, మీగడ సత్తిబాబు, వెలగా శ్రీను, కర్రి వెంకట సత్యనారాయణ, లోవరాజు, వైబోయిన రమణ, కొప్పిశెట్టి జగదీశ్వరరావు, కొంకిపూడి దొరబాబు, తోలేటి శ్రీనివాస్, కుంచె మధు, మేరిగి నాగేశ్వరరావు, ప్రగడ వీరబాబు తదితరులు పాల్గొన్నారు
రోలుగుంట:. రోలుగుంటలో మండల టీడీపీ ఇన్‌చార్జ్ బంటు రాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళ్లు అర్పించారు. బుచ్చింపేట గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్ పోతురాజునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రొంగలపాలెం, జెపి.అగ్రహారం తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు.
గొలుగొండ: మండలంలోని ఏఎల్ పురం గొల్లవీధిలో మాజీ జెడ్పీటీసీ చికెటిల తారకవేణుగోపాల్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. పేదవారికి దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడ్డు జమీల్, మాజీ ఎంపీటీసీ చింతల నారాయణమూర్తి నాయుడు పాల్గొన్నారు.
సిహెచ్. నాగాపురంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు పోలిశెట్టి జగ్గయ్యదొర, మాజీ సర్పంచ్ కొలగని రామారావు, జిల్లా తెలుగుదేశం పార్టీ మెంబర్ బొప్పన ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, పార్టీ సీనియర్ నాయకులు సుర్ల బాబ్జి పారేపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.










