
ప్రజాశక్తి-యంత్రాంగం
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు ఘనంగా నివాళి అర్పించారు. అనకాపల్లి, విశాఖపట్నంలో జిల్లాల్లోని ఆయా మండలాల్లో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించారు.
గొలుగొండ: మండలంలోని కృష్ణ దేవి పేటలో ఉన్న అల్లూరి ఘాట్ వద్ద మంగళవారం ఘన నివాళులు అర్పించారు. అల్లూరి సమాధి వద్ద స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్కులో అల్లూరి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. ఏఎంసీ చైర్మన్ చిటికెల బాస్కరనాయుడు, జడ్పీటీసీ సభ్యులు సుర్ల వెంకట గిరిబాబు, ఎంపీపీ మణికుమారి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు సర్పంచ్ లోచల సుజాత, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, యూత్ అధ్యక్షులు మాకిరెడ్డి రామకృష్ణ నాయుడు, ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్, వైస్ ఎంపీపీలు సుర్ల ఆదినారాయణ, పిఎసిఎస్ అధ్యక్షులు కిలపర్తి పెద్దిరాజు, ఏఏసి చైర్మన్ కొల్లు సత్యనారాయణపాల్గొన్నారు.
అల్లూరి చిహ్నాలు కాపాడడంలో వైసిపి ప్రభుత్వంకు నిర్లక్ష్య వైఖరి తగదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న యువసేన అధ్యక్షుడైన చింతకాయల రాజేష్ ఘాటుగా విమర్శించారు. అల్లూరి ఘాట్ వద్ద ఆయన ఘన నివాళులర్పించారు. సుమారు 250 బైకులపై తెదేపా నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా అల్లూరి ఘాటుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జెడ్పిటిసి చిటికల తారక వేణుగోపాల్, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు పెట్ల నారాయణమూర్తి, భీమిరెడ్డి సత్తిబాబు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సుర్ల బాబ్జి పాల్గొన్నారు.
క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో అల్లూరి కాంస్య విగ్రహానికి, సమాధులకు క్షత్రియ సేవా సమితి సభ్యులు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లల బాబురావు పాల్గొన్నారు.
చీడిగుమ్మల, చోద్యం, పాత కృష్ణ దేవి పేట గ్రామాల్లో అల్లూరి విగ్రహాలకు సిపిఐ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుబాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్వి రమణ, ఏఐవైఎఫ్ నాయకులు రాధాకృష్ణ సిపిఐ మండల కార్యదర్శి మేక భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
మాడుగుల: అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు మాడుగుల లో ఘనంగా జరిగాయి. బస్ స్టాండ్ వద్ద మన్యం జ్యోతి సేవా సంఘం సభ్యులు గౌరిపట్టపు వెంకట రమణ అధ్వర్యంలో నివాళులు అర్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శాస్త్రి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు.
నక్కపల్లి:అల్లూరి సీతా రామరాజు విగ్రవిష్కరణతో తన జన్మ ధన్యమైందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని వేంపాడు గ్రామానికి చెందిన క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు, ఎంపీడీవో సీతారామరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, జనసేన పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, తహసీల్దార్ అంబేద్కర్, ఈవో పిఆర్‌డి వెంకటనారాయణ, ఎంపీపి రత్నం, జెడ్పీటీసీ కాసులమ్మ, వైస్ ఎంపిపి లు నానాజీ, ఈశ్వరరావు పాల్గొన్నారు.
విప్లవ వీరుడు అల్లూరి ఆశయ సాధన కోసం కషి చేస్తాం
నర్సీపట్నంటౌన్:అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అన్నారు. అస్థానిక ఆర్డిఓ కార్యాలయంలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మాట్లాడారు.పట్టణ వైసీపీ అధ్యక్షుడు యాకా శివ, 6వ వార్డ్ వైసిపి ఇన్చార్జ్ యాదగిరి శేషు, నర్సీపట్నం వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ చామంతుల సురేష్, ఆదినారాయణ, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జానకిరామయ్య, పాల్గొన్నారు.
ఎస్.రాయవరం:మండలంలో ధర్మవరం అగ్రహారం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరికి నివాళి అర్పించిన వారిలో వైసిపి నాయకులు కర్రి శీను బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు బండి నాగేశ్వరరావు, గేదెల నాయుడు ఉన్నారు.
అనకాపల్లి : అల్లూరి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి యువత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో ఎస్పీ మురళీకృష్ణతో కలిసి అల్లూరి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ పి.వెంకటరమణ, అడిషనల్ ఎస్పీ బి.విజయభాస్కర్, అభిరాగ్‌సింగ్ రాణా, ఏటిడబ్ల్యుఓ నాగ శిరీష, ఏబీసీడబ్ల్యుఓ సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు. తుమ్మపాల గ్రామంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు, పేదలకు బట్టలు పంపిణీ చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు పాల్గొన్నారు. స్థానిక ఎఎంఎఎల్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ జయరాజు అల్లూరి చిత్ర పటానికి పూలమాల వేశారు. స్థానిక గూడ్స్ షెడ్ సాయిబాబా గుడి వద్ద అల్లూరి విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ వేర్వేరుగా నివాళులర్పించారు.
చోడవరం : గోవాడలో అల్లూరి విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పూలమాల వేశారు. సిపిఐ నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నివాళులర్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యారావు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట:రాజాంలో అల్లూరి విగ్రహానికి గ్రామస్తులు నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు నాగులాపల్లి సత్యనారాయణ, యండపల్లి సత్యారావు, మాజీ ఎంపీటీసీ మరిశా సతీష్ పాల్గొన్నారు. రాజాంలో సామాజిక కార్యకర్త ఆకుల నాగేశ్వరరావు అల్లూరి, వంగవీటి చిత్రపటాలకు పూలమాలలు వేశారు.
మధురవాడ:అల్లూరి జయంతిని పురస్కరించుకుని రుషికొండలోని గిరిజన సాంస్కృతికపరిశోధన శిక్షణ భవన్‌లో అల్లూరి విగ్రహానికి ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, అరకు ఎంపీ గొట్టేటి మాధవి నివాళులర్పించారు. గాం గంటందొర, గాం మల్లుదొర విగ్రహాలను ఆవిష్కరించారు. మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిసిసి చైర్‌పర్సన్ శోభ స్వాతిరాణి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, డైరెక్టర్ రవీంద్రబాబు., ఇడి చిన్నబాబు. నాగరాజు పాల్గొన్నారు.
పద్మనాభం: మండలంలోని పాండ్రంగిలో అల్లూరి, అల్లూరి మాతృమూర్తి నారాయణమ్మ విగ్రహాలకుభీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున పూలమాలలు వేసి నివాళులర్పించారు
అల్లూరి పోరాటస్ఫూర్తితో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ
సీతమ్మధార:విప్లవవీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ పిలుపునిచ్చారు. సీతమ్మధారలో అల్లూరి విగ్రహనికి సిపిఎం నాయకులు అనపర్తి అప్పారావు, పి.వెంకటరావు, కె.కుమారి, బాలకష్ణ, జివిరమణ, నాయుడు, శివనాగేశ్వరరావు, పివి రమణ నివాళులర్పించారు
సీతమ్మధార జంక్షన్‌లో, అల్లూరి విగ్రహానికి ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కె.కె రాజు, క్షత్రియ పెద్దలు నివాళులర్పించారు.
మధురవాడ : గణేష్‌నగర్‌లో అల్లూరి విగ్రహానికి పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగోతి సూర్యప్రకాష్, సిపిఐ మధురవాడ నగర కార్యదర్శి వి. సత్యనారాయణ నివాళులర్పించారు. కొమ్మాది కూడలి వద్ద సిపిఎం కార్యాలయంలో సిఐటియు నేతలు డి అప్పలరాజు, రాజకుమార్ అల్లూరికి నివాళులర్పించారు.
భీమునిపట్నం :మండల పరిషత్ కార్యాలయంలో అల్లూరికి ఎంపిపి డి వాసురాజు, జెడ్‌పిటిసి గాడు వెంకటప్పడు, దాకమర్రి ఎంపిటిసి చెల్లూరి నగేష్ బాబు, ఎంపిడిఒ పి వెంకటరమణ, బీచ్‌లోని అల్లూరి పార్కులో వైసిపి మూడో వార్డు అధ్యక్షుడు అల్లిపిల్లి నరసింగరావు, వి కొండబాబు, మాజీ కౌన్సిలర్ కె ఎల్లాజీ నివాళులర్పించారు.
శాఖా గ్రంథాలయంలో టిడిపి మూడోవార్డు కార్పొరేటర్ అప్పలకొండ, నూకరాజు, స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఎన్‌మూర్తి, నరసింగరావ్‌ు, అప్పలనాయుడు, శ్రీనివాసవర్మ అల్లూరికి నివాళులర్పించారు
తగరపువలస : జిఆర్ భవన్‌లో సిపిఐ, ట్రేడ్ యూనియన్ నాయకులు అల్లు బాబూరావు, ఎం అప్పలరాజు, కె ఈశ్వరరావు, టి సోమరాజు, సిహెచ్ నర్సింహులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పెందుర్తి : 97వ వార్డు, సుజాతనగర్ గిరిప్రసాద్ నగర్ సిపిఐ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యుడు శ్రీనివాసరావు పూలమాలలు వేశారు.
ఉక్కునగరం : 87వ వార్డు లక్ష్మీపురంలో అల్లూరి విగ్రహానికి టిడిపి జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి,బొండా జగన్నాధం (జగన్) నివాళులర్పించారు.
ఆరిలోవ : సిఐటియు ఆధ్వర్యంలో జూపార్కు వద్ద అల్లూరి చిత్రపటానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కె.సత్యనారాయణ,పైడిరాజు, నర్సింగరావు పాల్గొన్నారు.
సిపిఐ ఆధ్వర్యంలో 13వ వార్డు శ్రీకృష్ణాఫురంలో గల అల్లూరి విగ్రహానికి ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.విమల నివాళులు అర్పించారు. ముడసర్లోవ రోడ్డు దీనదయాల్‌పురం పభుత్వ పరిశీలన గృహంలో అల్లూరి చిత్రపటానికి డిసిపి(క్రైమ్) నాగేంద్ర, ఎపిపి ప్రమీల నివాళులు అర్పించారు.
ఎపిఇపిడిసిఎల్‌లో
సీతమ్మధార : అల్లూరి జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని ఎపిఇపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో అల్లూరి చిత్రపటానికి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పథ్వీతేజ్ ఇమ్మడి, డైరెక్టర్లు బి.రమేష్ ప్రసాద్, డి.చంద్రం, ఎవివి.సూర్యప్రతాప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్లు అచ్చి రవికుమార్, వి.విజయలలిత, డి.సుమన్ కళ్యాణి, ఓ.సింహాద్రి, జె.శ్రీనివాసరావు, ఎం.రవీంద్ర, పి.శ్రీనివాస్, జనరల్ మేనేజర్లు,సిబ్బంది పాల్గొన్నారు.
49వ వార్డు పరిధిలోని ఎఎస్‌ఆర్.నగర్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జివిఎంసి మేయర్ గొలగాని హరివెంకటకుమారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమిషనర్ సాయికాంత్‌వర్మ తదితరులు నివాళులర్పించారు.
టిడిపి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యాన పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, నాయకులు విఎస్‌ఎన్.మూర్తి యాదవ్, చిక్కాల విజయబాబు, రాజమండ్రి నారాయణ, విల్లూరి చక్రవర్తి, ఈతలపాక సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఎంవిపి కాలనీ : బీచ్ రోడ్ పార్కు హోటల్ వద్ద అల్లూరి విగ్రహానికి జివిఎంసి మేయర్ గొలగాని హరివెంకటకుమారి, కమిషనర్ సిఎం.సాయికాంత్‌వర్మ పూలమాలవేసి నివాళులర్పించారు.