Aug 27,2023 22:40

ప్రజాశక్తి - చీరాల
శ్రీశ్రీశ్రీ రామానందసరస్వతి ట్రస్ట్‌ వాడరేవు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం నిర్వహించిన వైద్యశిభిరంలో 284మందికి వైద్యపరీక్షలు చేశారు. గత కొన్నేళ్లుగా వాడరేవు ఆశ్రమం ఆవరణలో ఉచిత షుగరు వైద్యశిభిరం నిర్వహిస్తున్నారు. పరీక్షలు చేయించుకున్న వారందరికీ నెల రోజులకు సరిపడు మందులు ఉచితంగా ఇచ్చినట్లు ఆశ్రమ మేనేజర్‌ నారాయణం సురేష్‌ తెలిపారు. శిభభిరానికి హాజరైన వారికి అల్పారం ఏర్పాటు చేశారు. కరొనా నిబంధనల మేరకు ఎక్కువమంది ఒక చోట చేరకూడదన్న నిబంధనలతో 2020 నుండి ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ఇటీవల కరోనా తగ్గడంతో వైద్యశిభిరం నిర్వహణకు అనువుగా ఉన్నందున తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు.  మందులతోపాటు ఆహార, జీవన అలవాట్లు వ్యాయామం ఉండే విధంగా మార్చుకుంటే షుగరు నియంత్రణలో ఉంటుందని వైద్యులు తెలిపారు. డాక్టర్‌ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్‌ కమలారాజేశ్వరి, డాక్టర్‌ లలిత్‌ప్రకాష్‌, డాక్టర్‌ పేట శ్రీకాంత్‌, డాక్టర్‌ సుధాకర్‌ యాదవ్‌ వైద్యపరీక్షలు చేశారు. ట్రస్ట్‌ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, ఎ సురేష్‌, ఎంజి శంకరరావు, పి కామేశ్వరరావు, గోపాల్‌, కుమార్‌ రోగులకు ఆహారం, తాగునీటి వసతుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.