ప్రజాశక్తి-ఉయ్యూరు: జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సోమవారం ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లు అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను, ఆస్తి పన్ను,ఖాళీ స్థలాల పన్నులు నూరు శాతం వసూళ్లు జరగాలన్నారు. ఆదాయ వనరులు పెంపొందించుకుని స్వయం సమద్ధి సాధించాలని అభివద్ధిలో ముందడుగు వేయాలని సూచించారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో శానిటేషన్ మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ అవసరాలకు కంపాక్టర్ వాహనం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఉన్నతాధికారులకు లేఖ వ్రాసి సమకూర్చుకోవాలని కమిషనర్ కు సూచించారు. ఈ వాహనం ద్వారా సేకరించిన చెత్త క్రషింగ్ చేసి జిందాల్ కంపెనీకి ఉదయం సాయంత్రం రెండు ట్రిప్పులు చేరవేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్తుందన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షులు అబు కలాం మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.










