Oct 25,2023 22:31

ప్రజాశక్తి-ఉయ్యూరు : ఉయ్యూరు ఆర్డీవోగా డి.రాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆర్డీవోగా ఉన్న ఎన్‌. విజరు కుమార్‌ రామాయపట్నం పోర్టు జనరల్‌ మేనేజర్‌గా బదిలీకాగా ఆయన స్థానంలో భీమవరం నుండి రాజు ఉయ్యూరు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా విజయకుమార్‌ నుండి బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళుతున్న ఎన్‌ విజరు కుమార్‌ కు తహసీల్దార్లు, కార్యాలయ ఉద్యోగులు, ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ వెంకటేశ్వరరావు వీడ్కోలు పలికారు.