ప్రజాశక్తి-పెదబయలు : గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందచేయుటకు అక్టోబర్ 17 నుండి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జీపు జాత నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా బుధవారం పెదబయలు మండలంలో జీప్ యాత్ర చేరుకొని గిరిజన బాలికల మరియు బాలుర సంక్షేమ శాఖ ఉన్నత పాఠశాలలను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి మహేష్ మాట్లాడుతూ.... ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అనేక గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని, ఈ తరుణంలో విద్యార్థులకు రావలసిన కాస్మోటిక్ చార్జీలు మెస్ ఆర్జీలు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ యాత్ర ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజే యబోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో సర్వే నిర్వహించడం జరుగుతుందని ఈ సర్వేలో అనేకమైనటువంటి సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు నిక్కుల శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి జి ప్రసాద్, యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ జే. సత్యనారాయణ, ట్రైబల్ వెల్ఫేర్ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్షులు చెండా బాలకృష్ణ, పాఠశాల సిబ్బంది తరులు పాల్గొన్నారు.










