Jul 26,2022 23:36

వినతులు స్వీకరిస్తున్న కెకె.రాజు

ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా నియోజకవర్గ సమన్వయకర్త, కెకె.రాజు మంగళవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి పలువురు కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను కెకె రాజుకు వివరించారు. వినతిపత్రాలు తీసుకున్న కెకె.రాజు అధికారులతో మాట్లాడి కొన్ని వెంటనే పరిష్కరించారు. మరికొన్ని సంబంధిత అధికారులకు రిఫర్‌ చేసి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అల్లు శంకరరావు, 14వార్డు కార్పొరేటర్‌ కె.అనీల్‌కుమార్‌ రాజు, వార్డు అధ్యక్షులు పైడి రమణ, చల్లా ఈశ్వరరావు, నీలి రవి, సీనియర్‌ నాయకులు ఆళ్ల శ్రీనివాసరావు, బొడ్డెటి కిరణ్‌, వసంతల అప్పారావు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, రామిరెడ్డి, చందురెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.