* సిపి ప్రచార విభాగం జోనల్ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్
ఆమదాలవలస : ఉత్తరాంధ్ర ద్రోహి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అని వైసిపి ప్రచార విభాగం జోనల్ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ అన్నారు. చంద్రబాబు ు జిల్లాలోని ప్రాజెక్టులు పరిశీలనకు రావడాన్ని నిరసిస్తూ పట్టణంలోని బొడ్డేపల్లి పేట వద్ద ఉన్న జగనన్న ప్రజాసేవ కార్యాలయం వద్ద నల్ల బెలూన్లు ఎగరవేస్తూ ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నాయకులతో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వై.కృష్ణ పోలీసులతో అక్కడకు చేరుకొని రవితో పాటు మరో 15 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జిల్లాకు చేసిన ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ఒక్కటైనా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి జిల్లాకు వంశధార, ఆఫ్‌షోర్ రిజర్వాయరు, ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్, ట్రిపుల్ ఐటి, అంబేద్కర్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ లాంటి ప్రాజెక్టులను తీసుకువచ్చారని అన్నారు. సంతబొమ్మాళి మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, జెట్టి, పలాసలో కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి వాటిని తీసుకువచ్చి జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్నారని అన్నారు.










