పరిశీలిస్తున్న ఛైర్‌పర్సన్
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :18న మహాశివరాత్రి కారణంగా బలిఘట్టం ఉత్తర వాహినికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ సిబ్బందితో ఉత్తరవాహిని తీరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, స్నాన ఘట్టాలను శుభ్రపరిచి మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తామని, పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులకు అనుకూలంగా షవర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.










