ప్రజాశక్తి- సీతమ్మధార: ఉత్తర నియోజకవర్గ వైసిపి కార్యాలయం పక్కనే నెలకొల్పిన విజయ గణపతి మండపాన్ని నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు ఆహ్వానం మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాల వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి బుధవారం సందర్శించారు. పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న వైసిపి ఉత్తర నియోజకవర్గ కార్యాలయాన్నిసందర్శించారు.ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు కెకె.రాజు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి పి.బాలరాజు ,బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు, ఉత్సవ కమిటీ సభ్యులు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,14వార్డు కార్పొరేటర్ అనిల్‌కుమార్ రాజు, కిరణ్‌రాజు, ఆళ్ల శివగణేష్, నీలి రవి, అంబటి శైలేష్ పాల్గొన్నారు.










