Aug 13,2023 21:32

జిజిహెచ్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.సురేఖ

కడప ప్రతినిధి : జిజిహెచ్‌ వైద్యకళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఆధునిక కోర్సులకు అనుమతి మొదలు ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, పెరిగిన మెడికల్‌ సీట్ల నేపథ్యంలో జిజిహెచ్‌ వైద్యకళాశాల అభున్నతికి నిదర్శనం. దీంతోపాటు వైద్యవిద్యార్థుల బోధన, బోధనేతర అవ సరాలు, వసతి సదు పాయాల కల్పనపై దృష్టి సారించాం. వైద్య ప్రమా ణాల మెరుగుదలకు అవసరమైన విధానాలను అమలు చేయడంపై దృష్టి సారిస్తాం. ఫలితంగా నిపుణులైన వైద్యనిపుణులను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. 2006లో రిమ్స్‌ పేరుతో ఏర్పా టైన వైద్య కళాశాల అంచెలంచెలుగా కోర్సులను, ప్రమాణాలను పెంచుకుంటూ ఎదుగు తున్న క్రమాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్న జిజిహెచ్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.సురేఖతో ప్రజాశక్తి ముఖాముఖి.
యుజి, పీజీ కోర్సుల వివరాలు తెలపండి?
ప్రభుత్వ జనరల్‌ వైద్య కళాశాలలో ఇడబ్ల్యుఎస్‌ కోటా ను అమలు చేసిన నేపథ్యంలో 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో 175 ఎంబిబిఎస్‌, 113 పీజీ సీట్లు ఉన్నాయి.
కొత్త కోర్సుల అమలుపై మాట్లాడండి?
2023-24 అకడమిక్‌ఇయర్‌లో 11 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నాం. ఈమేరకు లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ లభించింది. ఇందులో ప్రధానంగా బయోకెమిస్ట్రీ, పాథాలజీ, ఫర్మకాలజీ, ఎస్‌పిఎం, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, ఫల్మనరీ మెడిసిన్‌, రేడియోలజీ, సైక్రియాట్రీ, రేడియో ఆంకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
యుజి, పీజీ తరగతులు ప్రారంభమెప్పుడు?
జిజిహెచ్‌ వైద్యకళాశాలలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి ఎంబి బిఎస్‌, ఐదు నుంచి పీజీకోర్సులను తరగతులను ప్రారం భించనున్నాం. ఈమేరకు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడమైంది.
ఆధునిక పరికరాల ఏర్పాటు గురించి చెప్పండి?
జిజిహెచ్‌ వైద్య కళాశాలకు కొత్త కోర్సుల అమలు నేపథ్యంలో డిసెంబర్‌ నాటికి ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయ నున్నాం. ఇందులోభాగంగా బ్రాచిథెరఫీ, టెలిథెరఫీ, రేడియేషన్‌ సాఫ్టీ పరికరం, సైరోమీటర్‌, లైట్‌సోర్స్‌, ఫ్లోరో స్కోపీ యూనిట్‌, మెమోగ్రపీ డిజిటల్‌ యూనిట్‌ మొదలగు పలు ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయనున్నాం.
వైద్యకళాశాల అభివృద్ధిపై మాట్లాడండి?
జిజిహెచ్‌ వైద్యకళాశాలలో 11 కొత్త కోర్సులకు అనుమతి లభిం చడం మొదలుకుని సూపర్‌స్పెషాలిటీ, కేన్సర్‌కేర్‌, సైక్రియాట్రీ బ్లాకుల నిర్మా ణంతో 130 బెడ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు 160 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అందుబా టులోకి వచ్చే అవకాశం ఉంది.
వసతి సదుపాయాల గురించి తెలపండి?
జిజిహెచ్‌ విద్యార్థులకు కొత్త రెసిడెన్సియల్‌ హాస్టల్‌లో వసతి సదుపాయాల కల్పనపై దృష్టి సారించడమైంది. మూడవ ఫ్లోర్‌ లోని మూడు దశలుగా 21 గదుల చొప్పున 63 గదుల్లో వసతి సదు పాయాలను కల్పించడమైంది.