
ప్రజాశక్తి - పెనుమంట్ర
మార్టేరు రోటరీ క్లబ్ భవనంలో మండలంలోని ఐదుగురు ఉత్తమ ఉపాధ్యాయులను మానవత సభ్యులు మంగళవారం రాత్రి ఘనంగా సన్మానించారు. మానవత అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మార్టేరు గర్ల్స్ హైస్కూల్ ఉపాధ్యాయులు సిహెచ్.రామకృష్ణ, ఆలమూరు హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు కొనకళ్ల సుజాత, పెనుమంట్ర హైస్కూల్ ఉపాధ్యాయులు వర్దనపు ప్రభుదాస్, ఓడూరు స్కూల్ ఉపాధ్యాయులు సత్తి విజయకుమారి, ఎస్.ఇల్లింద్రపర్రు స్కూల్ ఉపాధ్యాయులు తమనంపూడి వెంకటేశ్వరరెడ్డిలను మానవత జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహనరావు, కార్యదర్శి కొత్త సత్యనారాయణ మూర్తి, జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీసుభాషిణి, పోడూరు ఎంఇఒ జివి.సూర్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానవత మండల కార్యదర్శి బండి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ కర్రి కృష్ణరెడ్డి, జాయింట్ సెక్రటరీ దొంగ జయదుర్గారావు, ఛైర్మన్ చిర్ల సూర్యనారాయణరెడ్డి, ఆత్మీయ సహకార కమిటీ ఛైర్మన్ చిర్ల శ్రీనివాసరెడ్డి, మానవత సభ్యులు పడాల రామచంద్రారెడ్డి, పడాల జగన్నాథరెడ్డి, కోనాల నర్సిరెడ్డి, అల్లం భాస్కరరెడ్డి, ఎంపిటిసి సభ్యులు గుడిమెట్ల లక్ష్మణరెడ్డి, మార్టేరు ఉప సర్పంచి కర్రి వేణుబాబు పాల్గొన్నారు.