ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు పురపాలక పరిధిలోని పలు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులకు బుధవారం పట్టణంలోని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో లైన్స్‌క్లబ్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో లైన్స్‌క్లబ్ నిర్వాహకులు ఎం.వెంకటేశ్వర్లు, సోమిశెట్టి కిరణ్ కుమార్, ఎన్ సంతోష్ కుమార్, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ కళాశాలలో...
ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైన అధ్యాపకులకు బుధవారం కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి ఆధ్యాపకులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.










