Oct 05,2023 22:06

సన్మానం పొందిన ఉపాధ్యాయులతో అధికారులు, ప్రజాప్రతినిధులు

 కడప అర్బన్‌ నగరంలోని జడ్ పి సమావేశ మందిరంలో గురువారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉత్తమ ఉపా ధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి కడప కలెక్టర్‌ వి.విజరు రామరాజు, అన్నమయ్య కలెక్టర్‌ గిరీష్‌, చిత్తూరు జిల్లా జడ్‌పి చైర్మన్‌ శ్రీనివాసులు, తంబ ల్లపల్లి ఎమ్యేలే పెద్ది రెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు అతిథు లుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జడ్‌పి చైర్మన్‌ అమర్నాథ్‌ రెడ్డి మాట్లాడుతూ మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తామని, మనల్ని జ్ఞానవంతులుగా తీర్చి దిద్దడంలో వారి కషి వెలకట్టలేనిదన్నారు. ఉపాధ్యాయ వత్తి ఎంతో గొప్పదని సమాజంలో చిన్న పిల్లలను క్రమ శిక్షణతో పెంచి దేశానికి బావి పౌరులుగా తీర్చి దిద్దుతున్నారన్నారు. 1982 లో వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నాడు-నేడు పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రభుత్వ పాఠశాలను సమూలంగా మార్చారన్నారు కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ సమాజంలో మంచి విద్యా విధానాన్ని అందించి బావి తరాల పౌరులుగా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర వెల కట్టలేనిదని అన్నారు. భారతదేశ చరిత్రలో గురువుకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. అన్నమయ్య కలెక్టర్‌ గిరీశ్‌ మాట్లాడుతూ ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్న వారందరికీ ప్రధమ గురువు ఉపాధ్యాయులేనన్నారు. విద్యార్థి దశలో చదువుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికీ తమ హీరో టీచర్లే అని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమ ర్నాథ్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ఆకేపాటి ఫౌండేషనల్‌ ట్రస్ట్‌ ద్వారా రాజంపేట, కడప పార్లమెంటరీ నియో జకవర్గాలలో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ, ప్రయివేట్‌ ఉపాధ్యాయుల పని చేస్తున్న 400 మందికి పురస్కారాలు అందజేసి, సత్కరించి అవార్డులు అందించారు. సమా వేశంలో జడ్‌పి సిఇఒ సుధాకర్‌ రెడ్డి, కడప, అన్నమయ్య జిల్లాల డిఇఒలు రాఘవరెడ్డి, పురుషోత్తం, మాజీ ఎమ్మెల్సీ పోచం రెడ్డి సుబ్బారెడ్డి, ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఘనంగా నిర్వహించాయి. రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య, ఇంటాక్‌ ఉమ్మడి ఆధ్వర్యంలో సంస్థలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్క రించారు. రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యులు డాక్టర్‌ తవ్వా వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్‌ రిటైర్డ్‌ హిందీ పండితులు కల్లూరు బాల యల్లారెడ్డి, కె.వి. రమణా రెడ్డి, రిటైర్డ్‌ తెలుగు పండితులు డాక్టర్‌ వెల్లాల వేంకటేశ్వరాచారి, పి. నాగాంజనేయులు ఉపాధ్యాయులుగా చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పద్మప్రియ చంద్రారెడ్డి, శంకర రెడ్డి, గొబ్బూరి కోటేశ్వర రావు, రంగా, గంగాధర్‌, డేవిడ్‌, సతీష్‌, బాబు, నాగేంద్ర పాల్గొన్నారు.
నగరంలోని డిప్యూటీ సిఎం కార్యాలయంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకొని, రాష్ట్ర పతి అవార్డు గ్రహీత, జాతీయ పండిత రత్న అవార్డు గ్రహీత, విశ్రాంత అధ్యాపకులు విద్వాన్‌ డాక్టర్‌ గానుగపెంట హను మంతరావును ఉప ముఖ్యమంత్రి ఎస్‌ బి అంజద్‌ బాషా చేతుల మీదుగా మౌలానా ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసై టీ అధ్యక్షుడు షేక్‌. అబ్దుల్‌ షబ్బీర్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, ఉపాధ్యాయ రత్న అవార్డును అందజేశారు.