Sep 15,2023 00:38

ప్రజాశక్తి - చీరాల 
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దడంలోనే ఉపాధ్యాయులకు నిజమైన ఆనందమని ఎంఈఓలు సుబ్రహ్మణ్యం, సుధారాణి అన్నారు. మండలంలోని ఈపురుపాలెం జెడ్‌పి బాలికోన్నత పాఠశాలలో  సోషల్ టీచర్‌ డి సరళ కుమారి, పీడీ ఎన్ రోజ్ హెల్మ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు వచ్చిన సందర్భముగా ఘనంగా సత్కరించారు. విద్యార్థుల ప్రతిభకు గుర్తులే ఉపాధ్యాయులకు అవార్డులని అన్నారు. జెడ్పిటిసి పద్మనీ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహాలను విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు దాసరి సరళ కుమారి, జయరాజ్ దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ ఎం హనీర, మాజీ ఎంఇఓ ఝాన్సీ, సుధాకర్, ఎస్‌ఎంసి చైర్మన్ శ్రీకాంత్, శ్రీవల్లి, కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.