Sep 03,2023 23:57

ప్రజాశక్తి - వేటపాలెం
బాపట్ల వ్యవసాయ కళాశాలలో అద్యాపకునిగా పనిచేస్తున్న వేటపాలెం ప్రాంతానికి చెందిన గౌరాభక్తుని రవిబాబు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో రవిబాబు పేరు ఉండటంతో  స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన 1985 - 89లో అగ్రికల్చర్ బిటెక్ పూర్తి చేశారు. 1990 - 92లో ఉత్తరప్రదేశ్‌లో అగ్రికల్చర్ ఎంటెక్ పూర్తి చేశారు. 2009 - 2012లో కోయంబత్తూర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ పీహెచ్డీ పూర్తి చేశారు. 1999 జనవరి 11న బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అద్యాపకునిగా చేరారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. 14మంది ఎంటెక్, 10మంది అగ్రికల్చర్ పిహెచ్డి విద్యార్థుల పరిశోధనలకు గైడ్‌గా, చైర్మన్‌గా వ్యవహరించారు. గత ఐదు సంవత్సరాలలో 30కిపైగా పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ జనరల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు అభినందించారు. చదువుతోపాటు సామాజిక సేవా రంగాల్లో ముందుంటారని తెలిపారు.