Sep 16,2023 18:56

ప్రజాశక్తి - కాళ్ల
            రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సీసలి స్పెషల్‌ పాఠశాల ఉపాధ్యాయుడు బొబ్బిలి రాజమౌళి కోటేశ్వరస్వామిని విద్యా కమిటీ ఛైర్మన్‌ పి.రమేష్‌, ఉషోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో సీసలి గ్రామానికి రాజమౌళి కోటేశ్వరస్వామి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ బాతు మాణిక్యం, వార్డ్‌ మెంబర్‌ చార్లెస్‌, కమిటీ ప్రెసిడెంట్‌ భూపతి రాజారత్నం, జొన్నలగడ్డ పండు, అమృతరావ్‌, జౌదు అబ్రహం, ఎం.నతానియేలు, భూపతి యాకోబు, కొత్తపల్లి ఏసు పాల్గొన్నారు.
           పెనుమంట్ర :జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బ్రాహ్మణ చెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కొండేటి కాశీ విశ్వనాథంను పొలమూరు హైస్కూల్‌ కాంప్లెక్స్‌లో ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ఎస్‌.తాతయ్య అధ్యక్షతన శుక్రవారం రాత్రి అభినందన సభ నిర్వహించారు. ఈ నెల ఐదో తేదీన గురుపూజోత్సవం కలెక్టర్‌ పి.ప్రశాంతి చేతుల మీదగా పురస్కారం అందుకున్నారు. అభినందన సభలో కాశీవిశ్వనాథం తండ్రి చంచయ్య మాట్లాడుతూ తన కుమారుడు జిల్లా ఉత్తమ అవార్డు, సన్మానం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం కాశీ విశ్వనాథం, సత్యవతి (సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత) దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు డిఎన్‌వి.సత్యనారాయణ, ఎపిటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు పిఎన్‌వి.ప్రసాద్‌రావు, ఎపిటిఎఫ్‌ నాయకుల కె.రాంబాబు, పిఆర్‌టియు నాయకులు హరిరాజా, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కెఎన్‌యు.శ్రీనివాస్‌, వియ్యంకుడు గనిపిరెడ్డి శ్రీనివాస్‌, లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.