Aug 15,2023 23:24

ప్రజాశక్తి-యంత్రాంగం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్ల మంగళవారం అవార్డులు ప్రదానం చేశారు. కాకినాడ కార్పొరేషన్‌కు సంబంధించి జిల్లా స్థాయిలో ఎనిమిది మందికి అవార్డులు దక్కాయి. నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగ నరసింహారావుతో పాటు పలువురు అధికారులు, సచివాలయ కార్యదర్శులకు అవార్డులు అందజేసి అభినందించారు. అవార్డులు స్వీకరించిన వారిలో ఎస్‌ఇ పి.సత్య కుమారి, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పథ్వీ చరణ్‌, టిపిఆర్‌ఒ మానే కృష్ణమోహన్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ లాజర్‌, మరో ముగ్గురు సచివాలయ కార్యదర్శులు ఉన్నారు. అన్నవరం అచ్చంపేట, అన్నవరం ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ ఎం.షహజద్‌ ఆలీ ఉత్తమ సేవ అవార్డు అందుకున్నారు. ఆలీని ఆసుపత్రి సిబ్బంది అన్నవరం, అచ్చంపేట గ్రామస్తులు అభినందనలు తెలిపారు. తాళ్లరేవు సిహెచ్‌సి సూపరింటెండెంట్‌ పి.శిరీష, తహశీల్దారు ఎస్‌.పోతురాజు, విఆర్‌ఒ కాలా సత్యనారాయణ పాల్గొన్నారు. ఏలేశ్వరం అవార్డు గ్రహీతల్లో ఏలేశ్వరం నగర పంచాయతీ మేనేజర్‌ కె.శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌ భానుతేజ, విద్యుత్‌ ఎఇ సూర్యనారాయణ, విఆర్‌ఒ అవసరాల తిరుమలరావు, మహిళ పోలీస్‌ స్వర్ణపూడి ప్రవళిక ఉన్నారు. పెద్దాపురం తహశీల్దారు వజ్రపు జితేంద్ర, వ్యవసాయ శాఖ అధికారి కె.సంజరు కుమార్‌, మున్సిపల్‌ ఎఇ కృష్ణ జీవ ప్రసాద్‌, ఎంపిడిఒ కార్యాలయ సబార్డినేట్‌ కె.మీనాక్షి ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. జగ్గంపేట వ్యవసాయ విస్తరణ అధికారి జి.వీరశంకర్‌కు సేవా పురస్కారం లభించింది.