Sep 29,2023 23:18

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌
యువతరంగం ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి యువ నాటిక పోటీల్లో న్యూ స్టార్‌ మోడరన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ (విజయవాడ) వారి 'కపిరాజు' ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. సుమధుర కళా నికేతన్‌, జాషువా సాంస్కతిక వేదిక, ఆంధ్ర నాటక కళా పరిషత్‌, సిద్ధార్థ కళాపీఠం సంయుక్త నిర్వహణలో నగరంలోని ఎంబి విజ్ఞాన కేంద్రం చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో మూడు రోజులపాటు జరిగిన నాటిక పోటీల్లో ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నవరస థియేటర్‌ ఆర్ట్స్‌ (విశాఖపట్నం) వారి ముళ్లతీగలు, ప్రత్యేక జ్యూరీ బహుమతిని ఎస్‌డి సిద్ధార్థ మహిళా కళాశాల (యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌) విజయవాడ వారి 'ఇంకానా' నాటిక బహుమతులు అందుకున్నాయి. ఇంకా ఉత్తమ దర్శకులుగా పి దివాకర్‌ ఫణీంద్ర (కపిరాజు), ఉత్తమ నటుడుగా దిలీప్‌ కుమార్‌ (కపిరాజు), ఉత్తమ నటిగా సునీత (ముళ్లతీగలు), ఉత్తమ ఆహార్యం 'ఇంకానా', ఉత్తమ రంగాలంకరణ కపిరాజు వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా హెచ్‌విఆర్‌ఎస్‌ ప్రసాద్‌, కె శాంతారావు, కె కష్ణారావు వ్యవహరించారు. విజేతలను నగదు, జ్ఞాపికలతో పివి భాస్కర్‌ శర్మ (సుమధుర), నన్నపనేని నాగేశ్వరరావు (ఆంధ్ర నాటక కళా సమితి), పరుచూరి అజరు కుమార్‌ (జాషువా), గుండు నారాయణ, జివి రంగారెడ్డి, నరెన్‌, డాక్టర్‌ డి కైలాసరావు, కొప్పుల అశోక్‌ ఆనంద్‌, బి ఆంజనేయ రాజు సత్కరించారు.