Apr 26,2023 00:05

ఆనందపురం సర్పంచ్‌ చందక లక్ష్మిని సన్మానిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి

ప్రజాశక్తి -ఆనందపురం: జాతీయ పంచాయతీరాజ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆనందపురం మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రథమ స్థానం నిలిచిన తొమ్మిది పంచాయతీలకు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేశారు. ఆనందపురం గ్రామ పంచాయతీ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ విభాగంలో ఉత్తమ పంచాయతీగా అవార్డు ఎంపికైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పంచాయతీరాజ్‌ వ్యవస్థకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సర్పంచులు, సెక్రటరీలు భాగస్వామ్యలుగా ఈ అవార్డులు ప్రదానం చేసినట్లు తెలిపారు. గ్రామాలాభివృద్ధికి సర్పంచులు తమ వంతుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ లోకవరపు రామారావు, ఎంపిడిఒ అడప లవరాజు, వైసిపి మండల అధ్యక్షులు బంక సత్యం, జడ్‌పిటిసి సభ్యులు కోరాడ వెంకటరావు, భీమిలి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎలమంచిలి సూర్యనారాయణ, వైస్‌ ఎంపిపిలు పాండ్రంకి శ్రీను, బొట్ట రామకృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ మణిశంకర్‌నాయుడు, సర్పంచులు జి.శ్రీను, రమణ, చందక లక్ష్మి, బిఆర్‌బి నాయుడు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.