Apr 24,2023 20:16

కోటకొండ సర్పంచి తిమ్మక్కకు అవార్డు అందిస్తున్న ఎంపిడిఒ గౌరీదేవి

ప్రజాశక్తి - దేవనకొండ
మండల స్థాయి ఉత్తమ పంచాయతీగా పి.కోటకొండ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు ఎంపిడిఒ గౌరీ దేవి, ఇఒఆర్‌డి సూర్యనారాయణ తెలిపారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.కోటకొండ సర్పంచి తిమ్మక్కకు అవార్డు, ప్రశంసాపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. పారిశుధ్య చర్యలు, గ్రామ అభివృద్ధికి చేపడుతున్న పనుల్లో సర్పంచి కృషి చేయడం వల్లనే అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సుంకన్న పాల్గొన్నారు.