ముఖ్యమంత్రి నుంచి అవార్డు అందుకుంటున్న ప్రిన్సిపాల్
ప్రజాశక్తి - లింగసముద్రం :మండలంలోని పెదపవని డాక్టర్ బిఆర్ అబేద్కర్ గురుకుల పాఠశాలకు సాంఘిక సంక్షేమ శాఖ తరుపున ఉత్తమ గురుకుల పాఠశాలగా అవార్డు లభించింది.ఈ అవార్డును పాఠశాల ప్రిన్సిపాల్ కె.స్నేహలత 77వ స్వాతంత్ర దినోత్సం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా అందుకున్నారు నెల్లూరు జిల్లాలో ఉత్తమ ప్రిన్సిపాల్‌గా అవార్డు అందుకున్నారు. ఇదే పాఠశాలలో పనిచేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఎ.దుర్గాభవాని ఉత్తమ ఉపాద్యాయునిగా అవార్డు అందుకున్నారు. పాఠశాల అధ్యాపకలు, ఉపాద్యాయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.










