ఆరోగ్య మిత్ర అప్పారావు కు ప్రసంసాపత్రం అందజేస్తున్న కలెక్టర్ శివశంకర్
పల్నాడు జిల్లా: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రాలను ప్రోత్సహించటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందిస్తోందని కలెక్టర్ అన్నారు. అందులో భాగంగా జూలై-2023 నెలకు గాను సేవ మిత్రా అవా ర్డుకు వినుకొండ పట్టణంలోని తిరుమల నర్సింగ్ హోం హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్ర కాకాని అప్పారావు ఎంపిక అయ్యారు. ఈ అవార్డును కలెక్టర్ చేతుల మీదుగా స్థానిక కలెక్టరేట్ లో సోమవారం ఆయన అవార్డుతో పాటు రూ.5 వేలు నగదును అందుకున్నారు. కార్యక్రమం లో జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ పి. సునీల పాల్గొన్నారు.










