
ప్రజాశక్తి - భీమవరం రూరల్
ఉత్తమ అధ్యాపకులుగా అవార్డు పొందిన డిఎన్‌ఆర్ కళాశాల గణిత శాస్త్ర విభాగ అధ్యాపకురాలు డాక్టర్ బి.జ్యోతి, ఎకనామిక్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ ఎవి.నాగవర్మలను కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించినట్లు అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎన్.విజయకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ సోమరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు జి.పాండు రంగరాజు హాజరయ్యారు.
కాళ్ల :ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహిస్తే అవార్డులు వరిస్తాయని కాళ్ల ఎంఇఒ-1 అక్కబత్తుల రవీంద్ర అన్నారు. పెదఅమిరం మెయిన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయరాలిగా పని చేస్తున్న దొండపాటి ప్రసన్నభారతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని పెదఅమిరం గ్రామంలో ఆమెకు బుధవారం ఎంఇఒ-2 గాదిరాజు కనకరాజు అధ్యక్షతన అభినందన సభ నిర్వహించారు. అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవార్డు గ్రహీత బిఆర్‌ఎంకె.స్వామి, మాజీ సర్పంచి కఠారి విశ్వనాథరాజు, ఎస్‌టియు సాయివర్మ, జిల్లా అవార్డు గ్రహీత వేటుకూరి రవికుమార్ రాజు, కృపానందం, వనజ, గ్లోరీ, రంగా ప్రసాద్, ప్రసన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.