Sep 17,2023 21:55

ప్రజాశక్తి - కామవరపు కోట
   వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే మండపాలను తడికలపూడి ఎస్‌ఐ జయబాబు ఆదివారం పరిశీలించారు. పండగ సమయంలో సంతోషంతో, ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. పండుగ పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని, ప్రతిఒక్కరు కూడా శాంతియుతంగా పండగను జరుపుకోవాలని ఆయన సూచించారు. మండపాల వద్ద అశ్లీల డాన్సులు, మతపరమైన గొడవలు కానీ సృష్టించకూడదని, ప్రతి మండపంపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. నిమజ్జన సమయాలలో చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని తెలిపారు.