ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడ గాంధీనగర్ శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం పాఠశాల విద్యా ర్థులకు కథలు చెప్పడం, కథలు చదవడం, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ అంశములపై శిక్షణ ఇచ్చారు. లైబ్రేరియన్ ముల్లంపాక శ్రీని వాసరావు, బాల మందిరం అధ్యక్షులు అంగర గోపాలకృష్ణ, రిసోర్స్ పర్సన్ పి.వీరబాబులు విద్యార్థులకు చిత్రలేఖనం, పేపర్ క్రాఫ్ట్‌లపై, కథలు చదవడం, చెప్పడంపై శిక్షణ ఇచ్చారు. తాళ్ళరేవు ప్రజా సంఘాల భవనంలో నిర్వహిస్తున్న వేసవి వినోదం కార్యక్ర మంలో చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. నాలుగవ రోజులో భాగంగా సత్య సాయి పబ్లిక్ స్కూల్ టీచర్స్ తణుకు రాంబాబు, కన్నీడి వెంకట రమణ చిత్రలేఖనంలో మెళకువలు తెలిపారు. గుత్తుల మల్లేశ్వరరావు, పి శ్రీనివాస్, అత్తిలి బాబురావు, టేకుమూడి ఈశ్వరరావు క్యాంపును సందర్శించి విద్యార్థినీ విద్యార్థులకు అల్పాహారం ఇచ్చి ప్రోత్సహించారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యాసలపు సూర్యారావు భవనంలో శిబిరంలో ఉపాధ్యాయులు నోరి బలరామకృష్ణ ఆరోగ్య పరిరక్షణ, పర్యా వరణం, సత్ప్రవర్తన అనే అంశాలపై సినిమా గీతాలను పేరడీగా పాడి వినిపించారు. యుటిఎఫ్ నాయకులు మిరియాల జయశ్రీ కథలు చెప్పడం, పాటలు పాడటంలో అవగాహన కల్పించారు. నీలపాల బాలమురళీకృష్ణ మ్యాథ్స్‌లో, దుంగల పూజితా సూర్య శ్రీ కరాటేలో, శాస్త్రీయ ఆలోచన విధానంపై బుద్దా శ్రీనివాస్‌లు శిక్షణ ఇచ్చారు. సమ్మర్ క్యాంప్ కో-ఆర్డినేటర్ రొంగల అరుణ్, కూనిరెడ్డి అరుణ, అమృత, నమ్రత, డి.కృష్ణ, రవి పాల్గొన్నారు. పెద్దా పురం శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో ఎల్.రాజు నిత్యజీవితంలోని సామాజిక అంశాలపై వివరించారు. ఉపాధ్యా యుడు గుమ్మళ్ళ వీర వెంకటరావు మ్యాథ్స్ టిప్‌లు వివరించారు. గ్రంథాల యాధికారి పాలంకి నాగరాజు, సిబ్బంది బుల్లియ్య, మరియమ్మ పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ పెదబ్రహ్మదేవం శాఖ గ్రంధాలయంలో పాఠశాల విద్యార్థులకు కథలు చెప్పడం, కథలు చదవడం, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్, డాన్సులలో గ్రంథాలయ అధికారి పి.మణి కుమారి శిక్షణ ఇచ్చారు. కరప మండలం వేళంగి శాఖ గ్రంధాలయాన్ని జిల్లా గ్రంథాలయ శాఖ ప్రధాన కార్యదర్శి విఎల్‌ఎన్ ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. లైబ్రేరియన్ పీవీ రంగయ్య పిల్లలకు పుస్తక పఠనంపై వివరించారు. జన వ్ఞిన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్లమూరి శ్రీ రామారావు, ఖండవల్లి గుణేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం ద్వారానే మంచి జ్ఞానం అలవర్చు కోవాలని, గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
పెద్దాపురం సూర్యారావు భవనంలో పాటలపై కల్పిస్తున్న బలరామకృష్ణ










