ప్రజాశక్తి -భీమునిపట్నం సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు.స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, జెడ్‌పిటిసి గాడు వెంకటప్పడు, కో ఆప్షన్ సభ్యులు కొప్పల ప్రభావతి, జోనల్ కమిషనర్ ఎస్ వెంకటరమణ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, పలు పంచాయతీల సర్పంచ్‌లు , కార్య దర్శులు, సచివాలయ ఉద్యోగులు, వార్డు, గ్రామ వాలంటీర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొని, బీచ్‌లోని ఇసుక తిన్నెలపై ఉన్న వ్యర్ధాలను సేకరించి, గోనె సంచిలో వేశారు.
దివీస్ ఆధ్వర్యంలో
మెగా బీచ్ క్లీనింగ్‌లో చిప్పాడ దివీస్ ఉద్యోగులు, సిబ్బంది సుమారు 800 మంది పాల్గొన్నారు. భీమిలి బీచ్‌లో 500 మంది, మంగమారి పేట వద్ద 200 మంది, బోయి వీధి వద్ద 100 మంది దివీస్ ఉద్యోగులు పాల్గొన్నారు. సంస్థ డైరెక్టర్ మధుసూధనరావు, జనరల్ మేనేజర్ వైఎస్ కోటేశ్వరరావు, సిఎస్‌ఆర్ ప్రతినిధులు ప్రభాకర్, చంద్ర శేఖర్, సురేష్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు.
బీచ్ క్లీనింగ్‌లో పివిఎస్ ట్రస్ట్
ములగాడ: మెగా బీచ్ క్లీనింగ్‌లో పివిఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జివిఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు, 60వ వార్డు కార్పొరేటర్ పివి.సురేష్ ఆద్వర్యంలో దాదాపు 60మంది సభ్యులు ర్యాలీగా వెళ్లి పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తిప్పల వంశీ, గుడివాడ అనూష లతీశ్, రాజాన రామారావు, మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు.
బీచ్ క్లీనింగ్‌లో వార్డు కార్పొరేటర్లు
ఆరిలోవ : జివిఎంసి, పార్లే సంస్థ ఆధ్వర్యాన చేపట్టిన బీచ్ క్లీనింగ్‌లో భాగంగా బీచ్ రోడ్డు రాడిసన్ హోటల్ వెనుక నిర్వహించిన కార్యక్రమంలో 12, 13, 21 వార్డు కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి రామన్, కెల్ల సునీత సత్యనారాయణ, గేదెల లావణ్య నాగరాజు, రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సత్తి మందారెడ్డి, ముడసర్లోవ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కన్నేటి సుబ్బారెడ్డి, హుస్సేన్, అర్జున్ పాల్గొన్నారు.
గీతం ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో...
విశాఖపట్నం : గీతం ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో వాలంటీర్లు రుషికొండ, సాగర్‌నగర్‌బీచ్‌లోని ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, వ్యర్ధాలను సేకరించి సంచులకు నింపి జివిఎమ్‌సికి అప్పగించారు. గీతం క్యాంపస్ లైఫ్ ప్రోవైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ రమణరావు, డాక్టర్ షేక్‌షంషుద్దీన్, డాక్టర్ రాజు, టి.మాలతి, డాక్టర్ మహ్మద్ చిష్టి, డాక్టర్ కె.సురేష్ పాల్గొన్నారు.
ఆనందపురం : బీచ్ మెగా క్లీనింగ్‌లో ఆనందపురం మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని
చేపల తిమ్మా పురం నుంచి వారిజా ఆశ్రమం వరకు సాగర తీరంలో వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేసారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షులు బంకు సత్యనారాయణ, ఎంపిడిఒ లవరాజు నాయకులు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, గడ్రేడ్డి శ్రీను, బిఆర్‌బి నాయుడు, పిన్నింటి వెంకటరమణ పాల్గొన్నారు.
బీచ్ క్లీనింగ్‌లో ఎక్యుజె పిజి కళాశాల సిబ్బంది
గుడిలోవ ఎక్యూజె పీజీ కళాశాల విద్యార్థులు బీచ్ క్లీనింగ్‌లో పాల్గొని, ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తాచెదారాన్ని సేకరించి ఒకచోట చేర్చారు.కళాశాల డైరెక్టర్ పి సుధారాణి, ఎన్‌ఎస్‌ఎస్ పిఒ పవన్‌కుమార్ పాల్గొన్నారు
( దీని ఫోటో పెట్టగలరు)3:32 పంపబడినది










