ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: లబ్బీపేటలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్ద మహిళా కళాశాలలో సోమవారం కళాశాల కాన్ఫరెన్స్‌హాల్‌లో కుకరీ పోటీలు కళాశాల విద్యార్థులకు నిర్వహించారు. ఈపోటీలలో కార్పొహైడ్రేట్స్ ప్రాముఖ్యతను తెలియచేయడంతో పాటు గోధుమ పిండిని ఉపయోగించి వివిధ రకాలైన వంటకాలను ఏవిధంగా చేయవచ్చునో విద్యార్థిణులు చక్కగా చేసి ప్రదర్శించారు. కుకరీ పోటీలలో కళాశాలలోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుండి 127 మంది విద్యార్థినుల పాల్గొని వివిధ రకాలైన వంటకాలను తయారుచేశారు. ఈపోటీలకు న్యాయ నిర్ణేతలుగా కామినేని హాస్పటల్ డైటీషియన్ డాక్టర్ యశశ్వి, సిద్దార్ద హౌటల్ మేనేజ్‌మెంట్ కళాశాల నుండి చెఫ్ ప్రవీణ్ కుమార్, ఎపి ప్రొడక్టివిటీ కౌన్సిల్ డైరెక్టర్ కిరణ్‌మయి వ్యవహరించారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ వంటకాలను రుచిచూపి 11 మందిని విజేతలుగా ఎంపికచేశారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందచేశారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కల్పన, డైరెక్టర్ డాక్టర్ టి.విజయలక్ష్మి, కళాశాల ఫుడ్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె.ఎన్ వరలక్ష్మి పాల్గొన్నారు.










