May 20,2023 00:59
మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డును అందజేస్తున్న నాయుడు హనుమంతరావు

ప్రజాశక్తి-పర్చూరు: ఎమ్మెల్యే ఏలూరి సారథ్యంలో పర్చూరు ఋగ్వేద్‌ ఎరీనా స్టేడియంలో ఏలూరి యూత్‌ స్పోర్ట్స్‌ కల్చరల్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్‌ పోటీలు 6వ రోజు అత్యుత్సాహంగా సాగాయి. నమోవెంకటేశాయ హైదరాబాదు, శౌర్య క్లబ్‌ ఉత్తరప్రదేశ్‌ జట్ల మధ్య పోటీ జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ జట్టు 17.1 ఓవర్లలో 110 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మధ్యాహ్నం జరిగిన పోటీలో రాజస్థాన్‌ రాకర్స్‌, చిక్కోలు చీటాస్‌ వైజాగ్‌ జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన వైజాగ్‌ జట్టు 14.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు సాధించి సెమీ ఫైనల్స్‌కు చేరింది. శనివారం ఉదయం జరిగే సెమీ ఫైనల్స్‌లో శౌర్యక్లబ్‌ ఉత్తరప్రదేశ్‌, గుంటూరు మలినేని జట్ల మధ్య జరుగుతుంది. మధ్యాహ్నం చిక్కోలు చీతాస్‌ వైజాగ్‌, స్పార్టన్‌ వారియర్స్‌ తిరుపతి జట్ల మధ్య సెమీఫైనల్‌ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.