Oct 28,2022 23:27

నర్సీపట్నంలో ఆడుతున్న విద్యార్థినులు

ప్రజాశక్తి -పాయకరావుపేట: పట్టణంలోని కనోస ఇంగ్లీష్‌ మీడియా ప్రైవేట్‌ పాఠశాలలో నియోజవర్గ స్థాయి క్రీడలు పోటీలను రెండవ రోజు ప్రిన్సిపాల్‌ సిస్టర్స్‌ సోఫియా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడా పోటీలతో విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యతోపాటు క్రీడలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. క్రీడలు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతాయన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిఇటి శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌:
స్థానిక ఏపిఆర్‌ స్కూల్‌లో శుక్రవారం బాలికల ఆటల పోటీలు ఉత్సాహంగా సాగాయి. 11 కబడ్డీ(సీనియర్స్‌, జూనియర్స్‌) ఖోఖో, వాలీబాల్‌, ట్రోబాల్‌, బాల్‌బాడ్మింటన్‌, షటిల్‌, టెన్నికాయిట్‌, అధ్లెటిక్స్‌లో ఎంపికలు జరిగాయి. నాలుగు మండలాల నుండి 365 మంది పాల్గొన్నారు. ఈ టీములలో ఎంపికైన విద్యార్ధులు జిల్లా స్థాయి పోటీలకు హాజరవుతారు. స్థానిక ప్రిన్సిపాల్‌ సాల్మన్‌రాజు, నియోజకవర్గ సమన్వయకర్త కె.వరహాలబాబు, ఎంఇఒ సాయిశైలజ పర్యవేక్షించారు.