Sep 27,2023 18:33

 ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
   స్వచ్ఛత హే సేవా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఇండియన్‌ 'స్వచ్ఛత లీగ్‌' నిర్వహించారు. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కలిపిస్తూ స్వచ్ఛత ప్రతిజ్ఞ, పారిశుధ్య కార్యక్రమం ఈదర సుబ్బమ్మదేవి స్కూల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ, స్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, వార్డ్‌ పర్యావరణ కార్యదర్శులు, విద్యార్థులు పాల్గొన్నారు.