Dec 29,2022 00:08

హాకీ ఆడుతున్న క్రీడాకారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం సీఎం కప్‌ అండర్‌ 18 హాకీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్‌ అదారిటి అధికారి నగిరెడ్ది సూర్యారావు ఆధ్వర్యంలో హాకీ పోటీలు నిర్వహించారు. నక్కపల్లి, ఎలమంచిలికి చెందిన హాకీ క్రీడాకారులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని కోచ్‌ రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బియస్‌ హాకీ క్లబ్‌ ఫౌండర్‌ సూరిబాబు, చిన్న అప్పారావు, కార్యదర్శి తాతాజీ,రామచంద్ర రావు, నానాజీ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.