Nov 16,2022 23:52

పాడేరు కళాకారుల మయూర థింసా నృత్యం

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోటా) ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన మంగళవారం ప్రారంభమైన గిరిజన గౌరవ దినోత్సవం బుధవారం ఉత్సాహంగా సాగింది. బుధవారం కార్యక్రమంలో సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంప చోడవరం, చింతూరు, కెఆర్‌ పురం, నెల్లూరు, శ్రీశైలం ఐటిడిఎ గిరిజన సాంస్కృతిక ప్రదర్శన కళాకారులు నృత్య రూపాలను ప్రదర్శించారు. సీతంపేటకు చెందిన సవర కళాకారుల కంది కోతలు నృత్యం, పార్వతీపురం సవర కళాకారులచే సవర థింసా నృత్యం, శ్రీశైలం చెంచు కళాకారులు చెంచు నృత్యం, పాడేరు కళాకారులు మయూర థింసా, ఖోండు, కెఆర్‌.పురం, చింతూరు కళాకారులు కొమ్ము కోయ నృత్యం, నెల్లూరు ఐటిడిఎకు చెందిన యానాది కీలు గుర్రం నృత్యం ప్రదర్శించారు. 8 ఐటిడిఎ ప్రాంతాల గిరిజన కళాకారులు తమ కళాఖండాలు, చేతిపనులకు సంబంధించిన వస్తువులను వేదిక వద్ద ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌ కోసం కేటాయించిన స్టాల్స్‌లో ప్రదర్శించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన 25 స్టాల్స్‌లో వెదురు, క్లే, చెక్క క్రాఫ్ట్‌లు, బిస్కెట్లు, జనపనార సంచులు నెగ్‌-ఫైర్‌ ద్వారా ప్రైమర్‌లు, అల్లూరి సీతారామరాజు ఆర్ట్‌ గ్యాలరీ, మెడికల్‌ స్టాల్‌, వెదురు చికెన్‌, జిసిసి ఉత్పత్తులు, కాఫీ, సిల్వర్‌ ఓక్‌ ప్రత్యక్ష ప్రదర్శనలో ఉంచారు.