భట్టిప్రోలు : శ్రీకష్ణాష్టవి సందర్భంగా అద్దేపల్లి శ్రీ కష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక టిఎం రావు ఉన్నత పాఠశాలలో పోలురాధా ఎడ్ల పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ పోటీలను ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్ ప్రారం భించారు. పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీలను తిలకించేందుకు మండల పరిధి లోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ పోటీల్లో పెద్దపులివారి పంచాయతీ పరిధిలోని గుత్తా వారిపాలెం గ్రామానికి చెందిన కామరాజు గడ్డ బసవయ్య ఎడ్ల జత 2710.7 మీటర్లు లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ. 15, 116 నగదు బహుమతిని కైవసం చేసుకుంది. భట్టిప్రోలుకు చెందిన ఆదిన నాగరాజు ఎడ్ల జత 2611.7 మీటర్లు లాగి ద్వితీయ స్థానం, అద్దేపల్లికి చెందిన డొక్కు సుబ్బారావు ఎడ్ల జత 2607.11 మీటర్ల మీటర్లు లాగి తతీయ స్థానం, సూర్య పల్లికి చెందిన పసుపులేటి కష్ణ ఎడ్ల జత 2422.7 మీటర్లు లాగి నాల్గవ స్థానం, ఐలవరం అద్దేపల్లికి చెందిన చిట్టి బొమ్మల నాంచారయ్య, గొరిపర్తి భార్గవి ఎడ్ల జత 1800 మీటర్లు లాగి ఐదోస్థానంలో నిలి చాయి. విజేతలకు ద్వితీయ బహు మతిగా రూ. 10116, తతీయ బహుమతికి రూ. 5116, నాల్గవబహుమతిగా రూ. 4116, ఐదో బహుమతిగా రూ.3116 అందజేశారు. పోటీలకు రెఫరీగా కుందేటి శివన్నారాయణ, రమేష్, శ్రీనివాసరావు వ్యవహరించారు










