
ప్రజాశక్తి-గుంటూరు : గత రెండ్రోజులుగా రైల్వే డివిజనల్ మేనేజర్ పరిధిలో నిర్వహిస్తున్న డిఆర్‌ఎం కప్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా సాగుతున్నాయి. స్థానిక డిఆర్‌ఎం కాంపౌండ్‌లో నిర్వహించిన షటిల్ డబుల్స్‌లో 32 టీమ్స్ పోటీ పడ్డాయి. గుంటూరుకు చెందిన విజరుసాయిరెడ్డి, జితేంద్ర టీమ్ గెలుపొందింది. సిద్ధార్థ్ గౌతమ్, జయంత్ రెండో స్థానంలో, అబ్బాస్-సాయి, జి.రాజ్‌పాల్-షేక్.రియాజ్‌లు మూడు, నాలుగో స్థానంలో నిలిచారు. వాలీబాల్‌కు మొత్తం 16 టీమ్‌లు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆదివారం సాయంత్రం పోటీలు ప్రారంభం అయ్యాయి. ఇక క్రికెట్‌కు సంబంధించి 7, 8 తేదీల్లో లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. మొత్తం 6 జతల జట్ల మధ్య పోటీలు జరిగాయ. ఈనెల 14, 15 తేదీల్లోనూ క్రికెట్ పోటీలు కొనసాగుతాయి. 15న ముగింపు కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. పోటీలను డిఆర్‌ఎం రామకృష్ణ ఇతర అధికారులు పర్యవేక్షించారు.