ప్రజాశక్తి-కొత్తకోట:రావికమతం మండలం టి అర్జాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు జిల్లాస్థాయి ఎంపిక కమిటీ సారథ్యంలో జరిగింది. అండర్ 14, 17 విభాగాలలో జిల్లా వ్యాప్తంగా సుమారు 28 జట్లకు చెందిన బాల, బాలికలు ఈ ఎంపిక పోటిలల్లో పాల్గొన్నారు. ఈ పోటీలను స్పోర్ట్స్ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, స్కూల్ గేమ్స్ పెడరేషన్ కార్యదర్శి శేఖర్, ఎంపిపి పైల రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఎం. భవాని ప్రసాద్, దంట్ల వెంకట రమణ, గ్రామ సర్పంచ్ ఎం.అర్జున, ఎంఈఒ జయలక్ష్మి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి ఆదిమూర్తి, కె.జగ్గారావు, ఇల్లపు సన్యాసినాయుడు, సిఆర్‌పి జి.రామారావు, పిడి రమేష్ నాయుడు, స్కూల్ కమిటి చైర్మన్ శివయ్య నాయుడు పాల్గొన్నారు.










