Nov 06,2023 23:45

జెండా ఊపి 5కె రన్‌ను ప్రారంభిస్తున్న మాజీ ఎంపీ హర్షకుమార్‌

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాజీవ్‌ గాంధీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం 5కె రన్‌ నిర్వహించారు. రాజీవ్‌ గాంధీ విద్యాసంస్థల చైర్మన్‌, మాజీ ఎంపీ జివి.హర్షకుమార్‌ జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మానసిక వికాసానికి, శారీరక ధారుడ్యానికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతనోత్తేజం నింపుతాయన్నారు. కళాశాల నుంచి ప్రారంభమైన 5కె రన్‌ పేపరు మిల్లు రోడ్డు మీదుగా కంబాలచెరువు పార్కు, క్వారీ మార్కెట్‌ సెంటర్‌, ఆనంద్‌ నగర్‌, మల్లయ్యపేట నుంచి తిరిగి రాజీవ్‌ గాంధీ కళాశాల చేరుకుంది. విద్యార్థులు చాలా ఉత్సాహంగా రన్‌ లో పాల్గొన్నారు. మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ రన్‌లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులను హర్షకుమార్‌ అందించారు. కళాశాల ప్రిన్సిపల్‌ మేరీ జోన్స్‌ విద్యార్థులను అభినందించారు.