Feb 28,2023 22:00

       ఆగిరిపల్లి : పోతవరప్పాడు ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్‌ కళాశాలలో జాతీయ సదస్సు సన్‌రైజ్‌-2023 సందర్భంగా రెండోరోజ మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్నంటాయి. జాతీయ సదస్సులో భాగంగా తెలుగమ్మాయి, తెలుగబ్బాయి పోటీల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తెలుగుతనం ఉట్టిపడేలా చూపరులను ఆకట్టుకున్నారు. కూచిపూడి నృత్యం, జానపద నృత్యాలు, సినీగేయ పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ నాగభాస్కర్‌, డైరెక్టర్‌ రోషయ్య, అకాడమిక్‌ కో-ఆర్డినేటర్‌ డి.కైలాసరావు, కెవి.సాంబశివరావు, డి.సునీత, ఎన్‌.సాంబశివరావు పాల్గొన్నారు.