Feb 24,2023 21:39

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సైంటియా - 2023 టెక్నోమీట్‌ శుక్రవారం కళాశాల ఆడిటోరియంలో ఉత్సాహభరితంగా జరిగింది. ఈసందర్భంగా కళాశాల విద్యార్ధినీ, విద్యార్థులచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతకుముందు కార్యక్రమాన్ని కళాశాల కరస్పాండెంట్‌ ఫాదర్‌ ఎం.సగయరాజ్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో నాయతక్వ లక్షణాలతో పాటు ప్రశ్నించేతత్వం అలవరచలనే ఉద్దేశంతో తమ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఈ కార్యక్రమం నిర్వహించిందన్నారు. వివిధ కళాశాలల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. అనంతరం పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు. పేపర్‌, పేపర్‌ ప్రజంటేషన్‌లో కెబిఎన్‌ కళాశాల ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి ఎస్‌.ఎ.బి.నెహ్రూ, సైంటియా కో ఆర్డినేటర్‌ కె.అపర్ణ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.