ప్రజాశక్తి -తగరపువలస : చిట్టివలస ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఉత్తరాంధ్ర జిల్లా స్థాయి ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు సోమ వారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అక్కరమాని అప్పల నాయుడు జ్ఞాపకార్థం చిట్టివలస ఫుట్‌బాల్ క్లబ్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి అక్కరమాని చినబాబు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించనున్న టోర్నీని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్, జెడ్‌పిటిసి గాడు వెంకటప్ప డు, పిఎసిఎస్ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, నేతలు జీరు వెంకటరెడ్డి, తమ్మిన అశోక్, పందిరి విజరు, ఎఐటిియుసి నాయకులు అల్లు బాబూరావు పాల్గొన్నారు.టోర్నీలో 14 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.










