ప్రజాశక్తి - ఏలూరు
భవిష్యత్తులోనూ అధికారులందరూ కలిసిమెలిసి పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఏలూరు రేంజ్ డిఐజి జివిజి.అశోక్ కుమార్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 'హై టీ' కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. జిల్లా అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని కలెక్టర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా అధికారుల్లో మంచి టీం స్పిరిట్ ఉందని, వరదలు వంటి విపత్తు సమయాల్లో సమన్వయం, అంకితభావంతో పనిచేశారన్నారు. అదే దృక్పధంతో భవిష్యత్తులోనూ జిల్లాను అభివృద్ధి దిశలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన 'హౌసీ', తదితర పోటీలలో అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 'హౌసీ'లో జెసి బి.లావణ్య వేణి, ఇరిగేషన్ ఎస్‌ఇ శ్రీనివాసరావు, ఎవిఆర్.మోహన్, ఏలూరు ఆర్‌డిఒ కె.పెంచల్‌కిషోర్ విజేతలుగా నిలిచారు. వారికి డిఐజి బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో జిల్లా అధికారులు సరదాగా, ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలకు, పురుషులకు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పి డి.మేరీప్రశాంతి, ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజ, డిఎఫ్‌ఒ రవీంద్రదామా, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి మూర్తి, ఆర్‌డిఒ జాన్సీరాణి, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, డిఆర్‌డిఎ పీడీ ఆర్.విజయరాజు, మునిసిపల్ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ సత్యనారాయణ పాల్గొన్నారు.










