Sep 04,2023 23:11

ప్రజాశక్తి - తాళ్లరేవు, రౌతులపూడి, పెదపూడి తాళ్ళరేవు పంచాయతీ ఉపసర్పంచ్‌ ఎన్నిక సోమవారం ఉత్కంఠగా సాగింది. 14 మంది వార్డు సభ్యులున్న తాళ్ళరేవు పంచాయతీలో వైసిపి, టిడిపి బలపరిచిన అభ్యర్థులు ఇద్దరు పోటీలో నిలిచారు. వైసిపి బలపరిచిన అభ్యర్థి విత్తనాల పార్వతి విజయం సాధించారు. వైసిపి, టిడిపి బలపరిచిన అభ్యర్థికి ఏడేసి ఓట్లు సమానంగా రావడంతో సర్పంచ్‌ ఓటు కీలకంగా మారింది. సర్పంచ్‌ రెడ్డి అరుణ సుహాసిని దేవి తన ఓటును విత్తనాల పార్వతికి వేయడంతో విజయం వరించింది. విత్తనాల పార్వతి, ఆమె భర్త విత్తనాల రామకృష్ణను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్‌ సాగర్‌, వైసిపి మండల కన్వీనర్‌ కాదా గోవింద కుమార్‌, మాజీ సర్పంచ్‌ రెడ్డి బాబు, గ్రామ కమిటీ కన్వీనర్‌ ఆకుల వెంకన్న , బొంతు మోహన్‌, చిట్టూరి చలపతి, నందికోళ్ల శ్రీమన్నారాయణ, దేవస్థానం కమిటీ చైర్మన్‌ కొల్లు శ్రీనివాస్‌, పొన్నాడ భైరవమూర్తి, కుడుపూడి మల్లేష్‌, బొంతు శ్రీను, పిల్లి పరందేశ్వరరావు, మణికంఠ పాల్గొన్నారు.
రౌతులపూడి : ఎ.మల్లవరం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్‌ ఇటీవల మృతి చెందడంతో సోమవారం ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించారు ఇటీవల నిర్వహించిన వార్డు సభ్యుల ఎన్నికల్లో ఐదో వార్డ్‌ మెంబర్‌గా ఎన్నికైన రొంగల రాజేశ్వరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆమెను సర్పంచ్‌, వార్డ్‌ సభ్యులు అభినందించారు.
పెదపూడి కాండ్రేగుల పంచాయతీ ఉప సర్పంచిగా సాంబత్తుల సూర్యనాగమ్మ ఎన్నికైనట్లు ఇఒపిఆర్‌డి, ఎన్నిక అధికారి ఎస్‌.శ్రీనివాసు తెలిపారు. సోమవారం పంచాయతీలో నిర్వహించిన ఉప సర్పంచ్‌ ఎన్నికలో 10 వార్డు సభ్యురాలు సూర్యనాగమ్మ ఎన్నికైందన్నారు. ఆమె కుమారుడు, వైసిపి ఎస్‌సి సెల్‌ ఉపాధ్యక్షుడు సాంబత్తుల చంటి మాట్లాడుతూ ఎంఎల్‌ఎ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులకు కృతజ్ఞతలు తెలపారు.