Aug 29,2023 22:26

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న నాయకులు

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌, బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బత్తల వెంకటరమణ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ క్రికెట్‌టోర్నీ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే రెండు మండలాల్లో ఫైనల్‌ మ్యాచ్‌ ముగిశాయి. నేడు నల్లచెరువు మండలంలో బీసీ వారియర్స్‌ వర్సెస్‌ కప్పుల్‌ టీమ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది...ఈ మ్యాచ్‌ లో గెలిచిన టీమ్‌ కదిరిలో నిర్వహించే ఫైనల్స్‌ కి అర్హత సాధిస్తుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌ను డాక్టర్‌ బత్తల వెంకటరమణ తిలకించారు. ఈ కార్యక్రమంలో పాలఏకరి కార్పోరేషన్‌ డైరక్టర్‌ దశరథ నాయుడు, హనుమంతు రెడ్డి , పాఠశాల ఛైర్మన్‌ హరి, దొడ్డెప్ప , అంజి వాల్మీకి, పోలీస్‌ రెడ్డప్ప, అల్లాపల్లి రామంజులు , తదితరులు పాల్గొన్నారు.