ఉషోదయ ఫౌండేషన్ ద్వారా జాతీయ కవి సమ్మేళనం
ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు: స్థానిక భాకరాపేటకు చెందిన రచయిత్రి డాక్టరు ధనాశి ఉషారాణి ఆద్వర్యంలో భాకరాపేటలో నిర్వహించిన ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి కవులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో బోయి భీమన్న అవార్డులను , ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ అవార్డులను వివిధ రంగాల్లో సేవ చేసిన విశిష్ట వ్యక్తులకు అందించారు. ఇందులో ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ అవార్డులను 100 మందికి వివిధ రంగాల్లోని వారికి ప్రదానం చేసింది. ముఖ్య అతిథులుగా ఆదికవి నన్నయ్య, విశ్వవిద్యాలయ అధిపతి తరపట్ల సత్యనారాయణ , ప్రొఫెసర్ బుజ్జి ,మార్జీయాన పోఫెసర్, తిరుపతి షీ టీమ్ ఆఫీసర్ సుమతీ , మెడికో బ్రాడ్ సి ఈ ఓ డా. రామ్ ,డైరెక్టర్ సంగీత, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఫాస్టర్ సైలెస్ ,ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ధనాశి ఉషారాణి , రామచంద్రయ్య వరప్రసాద్ రోహిల కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. నిర్వహించారు. సాహితీ చరిత్రలో ఓ మైలురాయిగా ఈ కార్యక్రమం నిలుస్తుందని, నిర్వహించిన రచయిత్రి ఉషారాణిని పెద్దలు అభినందించారు.










