ప్రజాశక్తి - కౌతాళం
మండలంలోని శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో ఆదోని ఎండోమెంట్ అధికారి ఆధ్వర్యంలో దేవాలయ సహాయ కమిషనర్ రామాంజనేయులు ఆన్‌లైన్ టెండర్లు, బహిరంగ వేలం, షీల్డ్ టెండర్లను గురువారం నిర్వహించారు. ప్రింటింగ్‌కు సంబంధించి ఇద్దరు షీల్డ్ టెండర్లు వేయగా శుభలేఖ కార్డ్స్, గురు బృందావన్ గ్రాఫిక్స్ తక్కువ కోడ్ వేసి దక్కించుకున్నారు. వంట చెరకు సరఫరాకు ఇద్దరు టెండర్ వేయగా కె.రామాచారి రూ.6500లకు దక్కించుకున్నారు. కె.మనోహర్ రూ.6800లకు టెండర్ వేశారు. సెల్‌ఫోన్లు, లగేజీల కోసం ఇద్దరు టెండర్ వేశారు. పి.లక్ష్మీ రూ.4,59,410లకు దక్కించుకున్నారు. క్లాతింగ్ మెటీరియల్స్ కోసం నాగార్జున, శశి లక్ష్మీ, అపూర్వ శారీస్, సుస్మిత శారీస్ టెండర్ వేశారు. పూలు, పూలదండలు సరఫరా కోసం టి.రాఘవేంద్ర రూ.1550లకు దక్కించుకున్నారు. అన్నదానానికి కూరగాయలు సరఫరా చేసేందుకు జె.వన్నప్ప దక్కించుకున్నారు. అగర్‌బత్తీలు స్టాల్ కోసం ఆన్‌లైన్ ద్వారా ఎంకె.సోయా ప్రోటీన్ ఫార్ములాస్ దక్కించుకున్నారు. దేవస్థాన గోశాలకు విచ్చేసిన భక్తులకు వరి గడ్డి, పచ్చి గడ్డి, బెల్లం సప్లయి చేసేందుకు జె.ఈరమ్మ రూ.35,100 దక్కించుకున్నారు. దేవస్థానం భూములను సంవత్సర కాలానికి కె.నరసన్న 1.58 విస్తీర్ణం రూ.5200, కె.రామన్న గౌడ్ 2.67 విస్తీర్ణం రూ.23 వేలు, చాకలి ఉసేని 1.13 విస్తీర్ణం రూ.3500 షీల్డ్ టెండర్ ద్వారా బిడ్‌ను నమోదు చేసుకున్నారు. వీరి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి, పర్యవేక్షకులు వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్లు కిరణ్ పాల్గొన్నారు.
ఉరుకుందలో వేలం పాటలు నిర్వహిస్తున్న అధికారులు










